HanuMan: మా హనుమాన్ చిరంజీవి.. జీవితాంతం రుణపడి ఉంటా.. ప్రశాంత్ వర్మ ఎమోషనల్
ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. తేజ సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చి సందడి చేశారు. ఇక చిరంజీవి గురించి ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రశాంత్ వర్మ హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ... ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు సపోర్టుగా నిలిచి.. ముందుకు నడించారు. ప్రతి డైరెక్టర్ కు ఇలాంటి ప్రోడ్యూసర్ దొరకాలని కోరుకుంటున్నాను. సినిమా తీయాలంటే యుద్ధం లాంటింది. తేజ అన్నట్లు నేను ఒట్టి చేతులతో వెళ్లి ఫైట్ చేయలేను. నా ఫైట్ కు 12ఏళ్లు పట్టింది. నేను డైెరెక్టర్ అవ్వడానికి 12ఏళ్లు పట్టింది. ఇక టెక్నిషియన్స్, క్యాస్ట్ అందరికీ థ్యాంక్స్... అంటూ చెప్పుకువచ్చారు.

Recommended Video

ఇక మనల్ని ముందుకు తీసుకువెళ్లేది ఫ్యామిలీ.. సో ప్రతి ఒక్క టెక్నిషియన్స్ ఫ్యామిలీకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. సినిమా అవకాశం దొరకడం ఒక యుద్దం, సినిమా తీయడం మరో యుద్దం.. సినిమా రిలీజ్ చేయడం మరో యుద్ధం.. ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెంట హనుమంతుడు ఉంటారు.. అలా మా సినిమాకు వచ్చిన హనుమంతుడు చిరంజీవి గారు. మాకు ఒక అండ కావాలి అని చిరంజీవి గారిని అడగ్గానే చిరంజీవి గారు ఒప్పుకున్నారు. నేను ఆయనకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అంటూ తెలిపారు.

ఇక హనుమాన్ సినిమా అనేది సూపర్ హీరో సినిమా. చిన్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలాగా ఇది ఓ ఫాంటసీ సినిమా. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అలా స్ఫూర్తి తీసుకుని హనుమాన్ తెరకెక్కించాను. మీ లాంటి నా లాంటి వ్యక్తి శక్తులు వస్తే.. ఎలా అనేది సినిమాగా తెరక్కించాను. జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ స్పీచ్ ముగించారు.


Click it and Unblock the Notifications











