HanuMan: జై హనుమాన్‌లో తేజ పాత్ర చిన్నది.. అసలు క్యారెక్టర్ ఆ స్టార్ హీరోదే: ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్, పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో జై హనుమాన్ ఉంటుందని ప్రకటించారు. దానితో పాటు.. హనుమంతుడు రాముడుకి ఇచ్చిన మాట ఏమిటి అనే ట్విస్టు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేనా... జై హనుమాన్ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో క్లుప్తంగా తెలుసుకుందాం.
హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరే ఇప్పుడు అంతా వినిపిస్తుంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మొదటి తెలుగు సూపర్ హీరో సినిమా హనుమాన్ జనవరి 12న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ సక్సెస్ నమోదు చేసుకుంది. ఇక నిర్మాతలకు ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సందర్భంగా హనుమాన్ దర్శకుడు తన ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి నెట్టింట వైరల్ గా మారాయి.

ప్రశాంత్ వర్మ ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హీరో చిత్రంతో ముందుకు వస్తానని తెలిపాడు. అంతే కాదు... జై హనుమాన్ సినినిమాలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనేది చూస్తారు అని తెలిపారు. హనుమాన్ కేవలం ఒక భాగం మాత్రమే అంటూ వెల్లడించారు. అంతే కాదు.. సీక్వెల్స్, ప్రీక్వెల్స్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు బయటపెట్టారు. సముద్రఖని పోషించిన విభీషణుడి పాత్ర లేదని.... దీన్నొక ఫ్రాంఛైజీలా తీసుకురావాలనుకున్నప్పుడు ఈ పాత్రను క్రియేట్ చేసినట్లు చెప్పుకువచ్చారు.
హనుమాన్ కథతో పోలిస్తే.. జై హనుమాన్ మరింత స్పెషల్ గా ఉంటుందని వెల్లడించారు. ఇందులో తేజ పాత్ర తక్కువ నిడివితో ఉంటుందని తెలిపారు. జై హనుమాన్ చిత్రంలో కొత్త పాత్రలు తెరపైకి వస్తాయని తెలిపారు. అవేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలని సస్పెన్స్ పెట్టారు. అసలు 'జై హనుమాన్' అన్నది వేరే స్టోరీ కాగా.... 'హనుమాన్' ముందుగా తీసి, ఆ తర్వాత దాన్ని చేద్దామనుకున్నామని తెలిపారు. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైన తర్వాత రెండు కథలను కలిపామని స్పష్టం చేశారు.

ఇక ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో 20 స్క్రిప్టులు ఉన్నట్లు తెలిపారు. మొదటి దశలో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ఇంకాస్త సమయం ఉందని వెల్లడించారు. తనతో పాటు కొత్త దర్శకులు కూడా పరిచయమవుతారని వెల్లడించారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తుందని వివరించారు.
ఇక 'జై హనుమాన్', 'అధీర'తో పాటు సూపర్ విమెన్ కథలు కూడా వస్తాయని తెలిపారు. ప్రస్తుతం మూడు సినిమాలను రెడీ చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే జై హనుమాన్ సినిమాలో తేజ పాత్ర తక్కువగా ఉండి.. హనుమాన్ పాత్రతో పాటు పలువురు పాత్రలు ఉంటాయని ప్రశాంత్ వర్మ చెప్పడంతో... ఈ సినిమాలో చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ జై హనుమాన్ లో మెగా స్టార్ చిరంజీవి హనుమాన్ గా కనిపిస్తే.. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











