దర్శకధీరుడిని కలిసిన ప్రశాంత్ వర్మ.. కారణం అదేనా?
ప్రస్తుతం ఓ సినిమా హిట్ అయితే టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ దాన్ని మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ఇంకా ముందుకు వెళ్లేందుకు తమ వంతు బాధ్యతగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డికి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. వీకెండ్‌లో అయితే జాంబీరెడ్డి వసూళ్ల రోజూ పెరుగుతూనే వచ్చాయి.
జాంబీ రెడ్డి దర్శకుడు ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళిని కలిశాడు. ఈ మేరకు ప్రశాంత్ వర్మ వదిలిన పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే రాజమౌళిని ప్రశాంత్ వర్మ ఎందుకు కలిశాడా? అన్న అనుమానం నెటిజన్లలో పెరిగిపోతోంది. జక్కన్నతో దిగిన ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. థాంక్యూ సర్ అంటూ గాల్లో తేలిపోయాడు. అయితే రాజమౌళి జాంబీరెడ్డి సినిమాను వీక్షించినట్టు, అభినందించేందుకు పిలిచినట్టు తెలుస్తోంది.

జాంబీరెడ్డిపై రాజమౌళి కురిపించిన ప్రశంసలకు ప్రశాంత్ వర్మ ఇలా థాంక్యూ అని చెప్పినట్టున్నాడు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ పని పట్టేందుకు శ్రమిస్తున్నాడు. క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కించేందుకు గానూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై అదిరిపోయే సీన్లను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ సైతం తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్టు టాక్. అయితే ఆ మధ్య అన్నట్టుగా అ! సీక్వెల్ తీస్తాడో లేదా జాంబీ రెడ్డి సీక్వెలో తీస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











