ఎమ్మెల్యే తమ్ముడి హత్య.. ఆసక్తి రేపుతున్న 'కల్కి' హానెస్ట్ ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కల్కి'. శివాని-శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించగా ఆయన సరసన అదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటించారు. పూజిత పొన్నాడ, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ, శత్రు, చరణ్‌దీప్, వేణుగోపాల్, వెన్నెల రామారావు, డి.ఎస్.రావు, అమిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి.

కల్కి ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న చిత్రయూనిట్ ఇదివరకే ట్రైలర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి నింపింది. తాజాగా దానికి కొనసాగింపుగా హానెస్ట్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ విడుదల చేశారు. ఒక నిమిషం 53 సెకనులతో కూడిన ఈ ట్రైలర్ ద్వారా కల్కి థీమ్ ఏంటనేది పరిచయం చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. 1985 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ అనే ఊరిలో ఎమ్మెల్యే తమ్ముడిపై జరిగిన హత్య నేపథ్యంలో ఈ సినిమా కథ ఉందని అర్థమవుతోంది. ఇందులో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. టేకింగ్ పరంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో మెట్టు పైకెక్కారని స్పష్టంగా తెలుస్తోంది.

Prashanth Varmas Kalki Trailer Released

గతంలో వచ్చిన కల్కి టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన తెచ్చుకోగా, తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అమితమైన ఆసక్తి క్రియేట్ చేసింది. మొత్తానికి ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. జూన్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 'కల్కి' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X