HanuMan: హనుమాన్ టికెట్ ఒకటి కొంటే ఇంకో టికెట్ ఫ్రీ.. యూజ్ చేయాల్సిన కోడ్ ఇదే!
ఇప్పుడు దేశం మొత్తం వినిపిస్తున్న పేరు హనుమాన్. చిత్ర చిత్రంగా బాక్సాఫీస్ వద్దకు వచ్చి... సంచలన వసూళ్లు రాబడుతుంది. కేవలం రూ.60 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం... రూ.150కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా చూసిన రాజకీయ, సినీ ప్రముఖులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొడుతుంది. ఇక ఈ సినిమా టీమ్.. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక టికెట్ కొంటే.. మరో టికెట్ ను ఫ్రీగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే...
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇండియా సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాను గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది హనుమాన్.

హనుమాన్ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా విలన్ రాయ్ నటించాడు. ఇక ఈ వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ వంటి తదితురులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో రతితేజ ఓ వానరానికి వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్స్ వసూలు చేసి.. స్టార్ హీరోల రికార్డులను మడతపెట్టేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీమ్.. ప్రేక్షకుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సినిమా ప్రేమికులకు మిరాజ్ సినిమాస్ యాజమాన్యం సరికొత్త ఆఫర్ ను అనౌన్స్ చేసింది. అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా.. హనుమాన్ సినిమాపై ఆఫర్ ను మిరాజ్ సిినిమా యాజమాన్యం ఓ ప్రకటన వెల్లడించింది.

ఉత్తర ప్రదేశ్ లోని అయోద్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవం ఉందనే సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. రామ్ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22 నాడు ఈ సినిమాకు 'బై వన్.. గెట్ వన్ (ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం) ఆఫర్ ఇవ్వనున్నట్లు చెప్పుకువచ్చింది. MIRAJBOGO అనే కోడ్ ఉపయోగించి ఈ ఆఫర్‌ను యూజ్ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే అంటూ షాకిచ్చింది.

ఒక్క రోజు అయినా కూడా ఈ సినిమా చూసేందుకు చాలా మంది జనాలు వస్తుంటారు. మీరు కనుక హనుమాన్ చిత్రం చూడకపోతే వెంటనే ఈ ఆఫర్ ను ఉపయోగించుకోండి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుందని క్లైమాక్స్ లోప్రకటించారు. ఇక సీక్వెల్ లో రామ్ చరణ్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక రెండో పార్టులో తేజ పాత్ర చిన్నగా ఉంటుందని.. హనుమాన్ కు, రాముడు మధ్య కథ నడుస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











