HanuMan: ప్రశాంత్ వర్మ హనుమాన్ ర్యాంపేజ్... 2 రోజుల్లోనే 1000000+ టికెట్స్ ఔట్!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్. భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలోకి జనవరి 12న థియేటర్లలో విడుదలై విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను వసూళ్లు చేస్తుంది. ఇదిలా ఉంటే... బుక్ మై షోలో సంచలనం సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే...

ప్ర‌స్తుతం ఎక్క‌డ విన్న హనుమాన్ పేరే వినిపిస్తుంది. ఏ ఇద్దరు మూవీ లవర్స్ మాట్లాడుకున్న హనుమాన్ చూసావా అని చర్చించుకుంటున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్, విజువల్స్​ అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు.

Prashanth Varma Teja Sajja Hanuman Movie Record Create in Book My Show

ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించి కేవ‌లం రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. తెలుగులో తొలి సూపర్ హీరో చిత్రంగా వచ్చిన ఈ హనుమాన్ చిత్రం.. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పింది.

అందుకు తగ్గట్లుగానే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా గుంటూరు కారం సినిమాకు పోటీగా బాక్సాఫీస్ బరిలో నిలబడి.. వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు రెండు రోజుల్లో ఈ సినిమా రూ.24.58 కోట్లు షేర్ (రూ.45.45 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే... ఇంకో రూ5.90 కోట్లు వస్తే చాలు. ఇంకో రోజులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోనుంది.

ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. అంజనాద్రి అనే ఊహ ప్రాంతంలోని హ‌నుమంతు (తేజాస‌జ్జా) అనే కుర్రాడు ఉంటాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తుండేవాడు. అనుకోని సంఘ‌ట‌న‌తో హ‌నుమంతుకి కొన్ని అతీత శక్తులు లభిస్తాయి. ఆ శ‌క్తుల గురించి తెలుసుకున్న మైఖెల్ (విన‌య్‌రాయ్‌) అంజనాద్రి వచ్చి.... హనుమంతు వద్ద శక్తులని తన వశం చేసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. మరి ఆ శ‌క్తిని వ‌శం చేసుకోవ‌డానికి మైఖెల్ ఏం చేశాడు.. హనుమంతు మైఖేల్ ని ఎలా అడ్డురుకున్నాడు ? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X