HanuMan: ప్రశాంత్ వర్మ ప్రభంజనం... హనుమాన్ మూవీని ఇప్పటి వరకు ఎంత మంది చూశారంటే?

కంటెంట్ బాగుంటే... మన ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతారు. చిన్న సినిమాగా వచ్చి... పెద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా హనుమాన్. ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి 300 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఇదిలా ఉంటే.. హనుమాన్ మూవీ మరో రికార్డును సృష్టింది. ఈ సినిమా ఫుట్ ఫాల్స్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా... వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, సముద్ర ఖని వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి రూ. 60 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Records One Crore Foot Falls Full Details Here

ఇక సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లోకి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు... పలు విదేశీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సంచలనాలు సృష్టిస్తుంది. సంక్రాంతి సినిమాలన్నీ కలిపి ఎంత కలెక్ట్ చేశాయో... అంతా కలిపి హనుమాన్ మాత్రమే కలెక్ట్ చేసి.. రికార్డులు కొల్లగొడుతుంది. కంటెంట్ మాత్రమే గెలుస్తుందనే మాటని నిజం చేస్తూ... హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.

ఈ సినిమా విడుదల అయి 3 వారాలు అవుతున్నా... కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. తెలుగులో ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా... నార్త్ లోనూ దుమ్ములేపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 250 కోట్ల రూపాయలకు పైగా... కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల విడుదల కూడా లేకపోవడంతో.. హనుమాన్ కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో ఈ సినిమా రూ.300 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రెడ్ వర్గాల అంచనా.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Records One Crore Foot Falls Full Details Here

మరోవైపు నార్త్ అమెరికాలో కూడా హనుమాన్ హవా కొనసాగుతుంది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 5 మిలియన్ మార్క్ ని చేరుకుని సంచలనం సృష్టించింది. నాన్-రాజమౌళి, నాన్-ప్రభాస్ రికార్డుల తర్వాత హనుమాన్ మూవీనే టాప్ లో ఉందంటే... ఈ సినిమా ఏ మేర అక్కడ ఆకట్టుకుంటుందో అర్ధం అవుతుంది. నార్త్ లో కూడా హనుమాన్ సినిమా సాలిడ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది. ఇక హిందీలోనే 50 కోట్ల మార్క్ కు చేరువలో ఉంది.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Records One Crore Foot Falls Full Details Here

ఇకఇప్పుడు హనుమాన్ మరో రికార్డు సృష్టించింది. హనుమాన్ సినిమా ఫుట్ ఫాల్స్ లో రికార్డు సృష్టించింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా నమోదు చేయని నంబర్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. దాదాపు కోటి ఫుట్ ఫాల్స్ ని హనుమాన్ సినిమా సొంతం చేసుకుంది. అంటే ఈ సినిమాను థియేటర్లలో కోటి మంది చూశారు అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X