HanuMan Vs GunturKaaram: ప్రశాంత్ వర్మ హనుమాన్ రికార్డు.. 'గుంటూరుకారం'ను వెనక్కి నెట్టి నంబర్ 1గా.!
ఈ సంక్రాంతికి తెలుగు చిత్రాలు నాలుగు రిలీజ్ కానున్నాయి. అందులో రెండు ఇప్పటికే రిలీజ్ అయి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఒకటి హనుమాన్ కాగా.. మరొకటి సూపర్ మహేశ్ బాబు గుంటూరు కారం. ఇక ఈ చిత్రాలకు సూపర్ రెస్పాన్స్ రాగా... హనుమాన్ చిత్రానికి మరింత రెస్పాన్స్ వస్తుంది. అయితే హనుమాన్ చిత్రం ఇప్పుడు మరో రికార్డు సృష్టించింది. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాను వెనక్కి నెట్టి మరీ... ముందంజలో ఉంది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జనవరి 12న అనగా ఈరోజు రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం. మరొకటి ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబినేషన్లో వచ్చిన హనుమాన్. ఈ రెండింట్లో సంక్రాంతి విజేత ఎవరు అన్నదానికి అప్పుడే ఆన్సర్ దొరికేసింది. విడుదల అయిన మొదటి ఆట నుంచే... ప్రేక్షకులు గుంటూరు కారం కంటే హనుమాన్ కే పట్టం కడుతున్నారు. ఎక్కడా చూసిన హనుమాన్ పేరే వినిపిస్తుంది.

ఇక తాజాగా హనుమాన్ చిత్రం రికార్డు సృష్టించింది. చిన్న సినిమాగా, తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం... పెద్ద సినిమాలను అధిగమించింది. తాజాగా బుక్ మై షోలో మొన్నటి వరకు గుంటూరు కారం నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండగా... ఇప్పుడు ఆ స్థానాన్ని హనుమాన్ దక్కించుంది. మొదటి నుంచి హనుమాన్ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే రిలీజ్ అయ్యాక ఆ అంచానాలను దాటేసి మరీ ఎక్కువ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
జనవరి 12న విడుదలైన హనుమాన్, గుంటూరు కారం, అయాలాన్, కెప్టెన్ మిల్లర్, మెర్రీ క్రిస్మస్ చిత్రాలు టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో హనుమాన్, గుంటూరు కారం టాప్ 2 స్థానాల్లో ట్రెండ్‌గా నిలిచాయి. పెయిడ్ ప్రీమియర్‌ల నుండి పాజిటివ్ టాక్ రావడంతో, గుంటూరు కారం కంటే హనుమాన్ ముందంజలో నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ట్రెండింగ్‌లో మహేష్ సినిమా కంటే కొంచెం ఎక్కువ హనుమాన్ ట్రెండ్ అవుతోంది.
ఇక హనుమాన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఇక మహేశ్ గుంటూరు కారం ఒక్క తెలుగులోనే రిలీజ్ అయింది. కెప్టెన్ మిల్లర్, అయాలాన్ తమిళ వెర్షన్ లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇక వీటిలో హనుమాన్ మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. మరోవైపు గుంటూరు కారం మూవీకి ఐఎండీబీలో కేవలం 6.8 రేటింగ్ వచ్చింది. హనుమాన్ మూవీకి 8.2 రేటింగ్ రావడంతో హనుమాన్ మరో రికార్డును సైతం సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం పోటీ నడుస్తుంది. ఈ రెండు సినిమాలను కంపైర్ చేస్తూ నెటిజన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. చాలా మంది హనుమాన్ చిత్రానికే ఓటు వేస్తున్నారు.చూడలి మరి సంక్రాంతి విజేత ఎవరు కానున్నారో.


Click it and Unblock the Notifications











