HanuMan Trailer Review: హనుమంతుడే దిగివచ్చి దానవసంహారం చేస్తే.. చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు బ్రో!
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న చిత్రం హనుమాన్. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 19న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ ట్రైలర్ చూశాక మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. ఇక సూపర్ హీరోగా తేజా సజ్జా యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అసలు ట్రైలర్ ఎలా ఉందో కులంకశంగా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ ప్రారంభించిన తేజ సజ్జ.. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసిన ఈ కుర్ర హీరో.. ప్రస్తుతం హనుమాన్ అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ హీరో కథాంశానికి భక్తిని మిక్స్ చేసి.. ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్. జాంబీ రెడ్డి తర్వాత తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇది.

ఇక ట్రైలర్ ఓపెనింగ్ లోనే... ఒక పల్లెటూళ్ళో ఉండే తేజ సజ్జాకి అసమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరో వైపు ఓ విలన్ (వినయ్ రాయ్) దేని కోసమో ఇలాంటి శక్తి సామర్థ్యాలు కావాలని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతనికి హీరో గురించి తెలిసి ఇక్కడికి వచ్చి అతనిపై దాడి చేస్తే హీరోని హనుమంతుడు ఎలా కాపాడాడు... ఆ తర్వాత ఏం జరిగింది... అనే విధంగా ట్రైలర్ లో చూపించారు. మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి... రాక్షససంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు అనేదే స్టోరీగా కనిపిస్తుంది.

ఇక ఈ ట్రైలర్ షాట్స్ చూస్తుంటే... మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ట్రైలర్ మొత్తం స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది ప్రతి ఫ్రేమ్ లో డైరెక్టర్ టీమ్ ఎఫర్ట్ కనిపిస్తోంది. హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ తో 'హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ వీఎఫ్ ఎక్స్, విజువల్ వండర్ ట్రైయిలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడకుండా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

హనుమాన్ గా తేజ సజ్జా నటించగా.. హీరోయిన్ గా అమృతా అయ్యార్ నటిస్తుంది. ఇక వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా హనుమాన్ మూవీ రాబోతోందని తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్‌బాబు గుంటూరుకారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగలతో పోటీగా హనుమాన్ రిలీజ్ కాబోతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.
ఇండియన్ సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్న ఈ హనుమాన్... పాన్ వరల్డ్ గా తెరకెక్కింది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జనవరి 12న హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











