చిత్రపురి సొసైటీలో అక్రమాలు.. సీనీ కార్మికులకు తీరని అన్యాయం: ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆగ్రహం
సినీ కార్మికులకు చెందిన చిత్రపురి కాలనీలో ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని చిత్రపురి పోరాట సమితి నిరవధిక నిరహార దీక్షలు చేపడుతోంది.. మన భూమి ,మన ఇల్లు ,మన హక్కు నినాదాలతో గత 26 రోజుల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తోంది చిత్రపురి పోరాట సమితి. సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల్లో 70 శాతం బయటివాళ్లకే ఒక్కో ఇంటికి 1 లక్ష నుంచి 20 లక్షల వరకు లంచాలు తీసుకుని జూనియర్ ఆర్టిస్ట్, మ్యూజిషియన్, డైలాగ్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్, రైటర్స్ అసోసియేషన్స్ సభ్యత్వాలు సృష్టించి ఎన్నారైలకు, ఇంజనీర్లకు, బ్యాంక్ ఎంప్లాయిస్‌కు, బిల్డర్స్‌కు, డాక్టర్లకు అడ్డదారిలో ఇండ్లు ఇచ్చి కోట్లు గడించారని పలువురు ఆరోపించారు.
చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాల పై విచారణ జరిపించాలని , సినిమాయేతరులను వెంటనే ఆ ఇండ్ల నుంచి ఖాళీ చేయించి అర్హులైన సినీకార్మికులకు ఇండ్లు కేటాయించాలనే డిమాండ్ చేస్తున్నారు. చిత్రపురి పోరాట సమితి ఆధ్వర్యంలో కొన్నిరోజుల క్రితం చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలిపిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ బుధవారం రోజు కూడా దీక్షలో పాల్గోన్నారు..

ఈ సందర్భంగా మీడియాతో
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.... చిత్రపురి పోరాట సమితి చేస్తున్న ఆరోపణలు వాస్తవం ఉంది. 24 క్రాప్ట్స్‌లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాయేతరులకు చిత్రపురిలో ఇండ్లు కేటాయించారు. సుమారు 5 వేలకు పైగా నిజమైన సినీకార్మికులు ఇండ్ల కేటాయించాల్సి ఉంది. 26 రోజులుగా దీక్షలు చేపడుతున్నా చిత్రపురి హౌస్ంగ్ సోసైటికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది అన్నారు.
చిత్రపురి హౌసింగ్ సోసైటి లో జరిగిన అవకతవకలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ప్రతాని తెలిపారు. అంతేకాకుండా సినీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి కేటాయించడం చట్ట విరుద్దమని, వెంటనే ఆ స్కూల్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం కేటాంచబోయే 9 ఏకరాలను చిత్రపురి పోరాట సమితికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలిపారు..
చిత్రపురి కాలనీకోసం కృషి చేసిన మహనీయుడు యం ప్రభాకర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోడం చూస్తే చిత్రపురి హౌసింగ్ సోసైటికి ఉన్న నిబద్దత ఏంటో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
వీరితోపాటు బి నరసింహా రెడ్డి, మహేందర్, ఓ రవిశంకర్, మురళి పులువురు సినీకార్మికులు పాల్గొన్నారు


Click it and Unblock the Notifications