కారుతో గుద్ది గాయపడిన వ్యక్తినే కొట్టిన వైనం.. నటుడిపై కేసు నమోదు!
బాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రతీక్ బబ్బర్ పై గోవాలో కేసు నమోదైంది. భాగీ 2, దోభీ ఘాట్, జానే తు యా జానే నా చిత్రాలతో ప్రతీక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజగా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రతీక్ పై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని పనాజీ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి ప్రతీక్ కారుని వేగంగా డ్రైవ్ చేసుకుని వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువకుడిని గుద్దడంతో అతడికి గాయాలయ్యాయి. పైగా కారుకు అడ్డం వచ్చాడంటూ అతడితో గొడవ పెట్టుకుని కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అతడే నా కారుకు అడ్డం వచ్చాడని, కారు అద్దాలు కూడా పగలగొట్టాడని ప్రతీక్ పోలీసులకు తెలిపాడు. ప్రతీక్ కారుని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పలు సెక్షన్ల కింద ప్రతీక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











