ప్రతిరోజూ పండగే ట్రైలర్: తాతకు గురిపెట్టిన సాయి ధరమ్ తేజ్..

అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై రూపొందుతోన్న సినిమా 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన రాశి ఖన్నా ఆడిపాడుతోంది. థమన్ బాణీలు కడుతున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పటికే పలు అప్‌డేట్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ ద్వారా సినిమాపై హైప్ పెంచేశారు. యూత్ మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. 2 నిమిషాల 18 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Prati Roju Pandaage Trailer Released

ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో తాతామనవాళ్లు సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్ లపై షూట్ చేసిన సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రాశి ఖన్నాతో మెగా మేనల్లుడి రొమాంటిక్ సీన్స్ చూసి యూత్ పులకరించిపోతున్నారు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా ప్రమోషన్స్ మేజర్ అసెట్ అయిందని చెప్పుకోవచ్చు.

ఇప్పటి వరకు రిలీజైన అన్ని అప్‌డేట్స్‌కి వచ్చిన ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందని ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. డిసెంబర్ 20వ తేదీన 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల కానుంది. ఆ రోజు నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రతిరోజూ పండగే అవుతుందని అంటున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X