ఆఫ్రికాలో సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా.. 'ప్రతిరోజూ పండగే'

అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై రూపొందుతోన్న సినిమా 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన రాశి ఖన్నా ఆడిపాడుతోంది. థమన్ బాణీలు కడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

ఇప్పటికే పలు అప్‌డేట్స్ ఇచ్చి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాల చుట్టూ తిరిగే కథ ఇది. యూత్ మొదలుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది.

Prati Roju Pandage Overseas Release Update

తాతామనవాళ్లు సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్ లపై షూట్ చేసిన సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయని టాక్. హీరోయిన్ రాశి ఖన్నాతో మెగా మేనల్లుడి రొమాంటిక్ సీన్స్ చూసి యూత్ పులకరించిపోతారని అంటున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ప్రతిరోజూ పండగే అవుతుందని చిత్రయూనిట్ పేర్కొంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఆఫ్రికాలో ప్రైడ్ సినిమా వారు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, విజయ్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X