జీవిత లేకపోతే గరుడవేగ లేదు.. ప్రవీణ్ సత్తారు

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.

Praveen Sattaru about Jeevitha in Kalki trailer function

ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ''రాజశేఖర్‌గారికి జీవితగారు బ్యాక్‌బోన్‌గా ఉన్నారు. జీవితగారు లేకపోతే 'గరుడవేగ' అయ్యేది కాదు. ఇప్పుడూ అదే రిపీట్‌ అవుతుందని అనుకుంటున్నా. రాజశేఖర్‌గారు చేసే ప్రతి సినిమాకు జీవితగారు బ్యాక్‌బోన్‌లా ఉంటున్నారు. సినిమాలో విషయం ఉందా? లేదా? అనేది టీజర్‌ రిలీజ్‌ కాగానే తెలుస్తుంది.

'కల్కి' మోషన్‌ పోస్టర్‌ నుంచి చాలా క్యూరియాసిటీ కలిగించింది. టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక సినిమాలో ఏదో విషయం ఉందని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. చాలా నిజాయతీగా సినిమా చేశారు.

'గరుడవేగ' కన్నా రెండింతలు ఆడాలని కోరుకుంటున్నా. ఇది ఎంత పెద్ద హిట్‌ అయితే... 'గరుడవేగ 2'కి నేను అంత ఎక్కువ డబ్బులు పెట్టి తీయవచ్చు. నా స్వార్థం నాది. ప్రశాంత్‌ వర్మ తీసిన 'అ!' ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌. అటువంటి సినిమాకు స్ర్కీన్‌ప్లే రాయడం చాలా కష్టం. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్‌ నుంచి ఫర్ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో తన కమాండ్‌ ఏంటో 'అ!'లో మనకు తెలుస్తుంది.

టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమా తనకు మంచి పేరు, పెద్ద సినిమాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. 'గరుడవేగ' కన్నా ఈ సినిమా బావుంటుంది. అందులో సందేహం లేదు'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X