Game On.. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.. ఊహించని ట్విస్ట్, టర్న్‌లతో..
సైకాలజికల్, రొమాంటిక్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఆన్ మూవీ ప్రారంభ వేడుక సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. రవి కస్తూరి సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, పమిడి క్రియేషన్స్ పతాకంపై గీతానంద్, నేహా సోలంకి జంటగా రూపొందుతున్నది. దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గేమ్ ఆన్ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో వైభవంగా ప్రారంభమైంది. హీరో గీతానంద్, నేహా సోలంకిపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ప్రెస్ మీట్‌లో ప్రముఖులు మాట్లాడుతూ..

చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టి మాకు దీవెనలు అందించినందుకు ధన్యవాదాలు. 2020 నుంచి ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ నెక్స్ట్ లెవల్ సినిమా ఇవ్వాలని ప్రయత్నం చేశారు. సినిమా చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
చిత్ర నిర్మాతలు కుమార్ బాబు, పమిడి రమేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో యూత్‌ను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. స్క్రిప్ట్ ఔట్ ఫుట్ బాగా వచ్చింది అని అన్నారు. ప్రస్తుతం యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, యంగ్ జనరేషన్ ఎలా ఉండాలి అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నది అని పమిడి రమేష్ అన్నారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ గేమ్ ఆన్ చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి, ట్విస్ట్ & టర్న్స్ ఇందులో చాలా ఉంటాయి అని అన్నారు.
హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ... ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఇది. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అవుతుంది అని అన్నారు.
హీరోయిన్ వసంతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మోక్ష క్యారెక్టర్ కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అందుకు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, వసంతి, ధామరాజు, ఆదిత్య మీనన్, మధుబాల, శుభలేఖ సుధాకర్, యోగి, శ్రీను రాథోడ్ , జేజా, నవీన్ తదితరులు
నిర్మాత: కుమార్ బాబు జి.
సహ నిర్మాత: పమిడి రవితేజ
రచన, దర్శకత్వం: దయానంద్
డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫి: అరవింద్ విశ్వనాధన్
మ్యూజిక్ డైరెక్టర్: అశ్విన్, అరుణ్
పీఆర్వో: మధు వీఆర్


Click it and Unblock the Notifications











