గరుడ వేగ దర్శకుడికి హీరో దొరికాడు.. ఈసారి ఎలాంటి ప్రయోగమో!
గుంటూర్ టాకీస్, గరుడ వేగ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తానేంటో ప్రవీణ్ సత్తారు నిరూపించుకున్నాడు. గరుడ వేగ చిత్రం మంచి విజయం సాధించింది. యాక్షన్ కథని ప్రవీణ్ సత్తారు డీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గరుడ వేగ చిత్రం తర్వాత ప్రవీణ్ నితిన్, రామ్ లాంటి యంగ్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రవీణ్ కొత్త చిత్రానికి హీరో దొరికినట్లు తెలుస్తోంది.
అక్కినేని నాగచైతన్య ప్రవీణ్ వినిపించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గరుడ వేగ చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలతో పోలీస్ డ్రామా నడిపించిన ప్రవీణ్ తన కొత్త చిత్రంలో ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడో చూడాలి. నాగ చైతన్య ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చైతు, సమంత జంటగా నటిస్తున్న మజిలీ తెరకెక్కుతోంది.

ఈ చిత్రం తర్వాత చైతు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. త్వరలో వెంకీ మామ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య చైతు, ప్రవీణ్ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











