twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC15: రామ్ చరణ్ సినిమా నుంచి మరో లీక్.. ఏకంగా 20 నిమిషాలు కుమ్ముడే

    |

    చిరంజీవి వారసుడిగా హీరోగా పరిచయం అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను, ఫాలోయింగ్‌ను కూడా తక్కువ సమయంలోనే అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇక, ఇటీవలే RRR (రౌద్రం రుధిరం రణం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్.. బ్లాక్ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

    Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ సినీ చరిత్రలోనే దిగ్గజ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చింది. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టిన ఈ దిగ్గజ దర్శకుడు.. వాటిని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలెట్టేశారు. ఇలా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు.

    Pre Climax Fight Highlight in Ram Charan and S. Shankar Movie

    రామ్ చరణ్ - ఎస్ శంకర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో ప్రీ క్లైమాక్స్‌లో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌ను పెట్టారట. ఇది దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగుతుందని అంటున్నారు. ఇందులో చరణ్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడని తెలిసింది. దీనికోసం విదేశాలకు చెందిన ఫైట్ మాస్టర్లను కూడా తీసుకు వచ్చారని తెలిసింది. చరణ్ కెరీర్‌లో ఎప్పుడూ చేయని విధంగా ఈ ఫైట్ కోసం అతడు ఎంతో శ్రమించాడని టాక్.

    బికినీ సైజ్ తగ్గించేసిన స్టార్ హీరోయిన్: అబ్బో ఇలా తెగించేసిందేంటి!బికినీ సైజ్ తగ్గించేసిన స్టార్ హీరోయిన్: అబ్బో ఇలా తెగించేసిందేంటి!

    ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'సర్కారోడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

    English summary
    Mega Power Star Ram Charan Now Doing a film with S. Shankar. Pre Climax Fight to be Highlight in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X