Naa Saami Ranga Pre Release Review ఆ మూడింటిని నా సామిరంగ మట్టికరిపిస్తుందా? నాగార్జున బాక్సాఫీస్‌ను గట్టిగా,,
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస నిర్మాతగా, పవన్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం నా సామిరంగ. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ భామ ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, మిర్నా మీనన్, రాజ్ తరుణ్, రుక్సర్ థిల్లాన్ నాజర్, రావు రమేష్ తదితరులు నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్లోకి వెళితే..
మలయాళం సినిమా రంగంలో ఘన విజయం సాధించిన పొరింజు మరియం జోష్ మూవీ ఆధారంగా నా సామిరంగ సినిమా తెరకె్కించారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. గ్రామీణ నేపథ్యం, స్నేహం, ప్రేమ, ఎమోషన్స్‌తో రూపొందించిన ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తొలి చిత్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నా సామిరంగ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆస్కార్ లభించిన తర్వాత ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం విశేషంగా మారింది. గతంలో ప్రసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు, క్రిమినల్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి లాంటి చిత్రాలు ఆయన, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చాయి. ఈ సినిమాలో ఐదు పాటలను అందించడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
నా సామిరంగ సినిమాలో ఎక్కువ మంది నటీనటులు నటించారు. ఆ పాత్రలన్నీ కథలో చాలా కీలకం కావడంతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతోపాటుగా ఈ సినిమా నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు అయ్యాయని, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లుగా పేర్కొంటున్నారు.
నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. శాటిలైట్, ఓటీటీ రైట్స్ భారీ మొత్తం లభించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 32 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే..నైజాం థియేట్రికల్ హక్కులు 5 కోట్ల మేర, సీడెడ్ రైట్స్ 2.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ 8.5 కోట్లు అమ్ముడుపోయినట్టు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల హక్కులు 16 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక రైట్స్‌ను 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 19 కోట్ల మేర జరిగాయి.
ఇక సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్న నేపథ్యంలో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలతో పోటీ పడి నా సామిరంగ వస్తున్నది. ఈ సినిమా సంక్రాంతికి హిట్ అవుతుంది. బాక్సాఫీస్‌ను గట్టిగా కొడుతాం అని హీరో నాగార్జున అక్కినేని అన్నారు. ఈ సినిమా విజయంపై భారీగా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం అందుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











