ప్రీతి జింటా ఫిట్‌నెస్ వీడియో వైరల్.. కుక్క వెంటాడితే భర్త ఏం చేశారంటే..
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా లాక్‌డౌన్ సమయంలో కూడా ఫిటినెస్‌పై శ్రద్ద పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నం చేశారు. ఆరోగ్యం కోసం ప్రీతి జింటా చేసే ఎలాంటి ఎక్సర్‌సైజులకైనా భర్త జీనీ గుడెఎనఫ్ పూర్తి సహకారం అందిస్తారు. వ్యాయామం పట్ల ఆమె క్రమశిక్షణకు తన వంతు సహాయం అందిస్తారు.
ఇటీవల ప్రీతీ జింటా పెట్టిన ఓ వీడియో అందర్నీ ఆకట్టుకొంటూ వైరల్‌గా మారింది. తాను భూమిపై పుషప్ కొడుతూ ఉంటే తన పెంపుడు కుక్క చలాకీగా ఆమెను డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే తన పెంపుడు కుక్క ఎక్సర్‌సైజ్ చేయకుండా ఆడ్డుకోవడం చూసిన జీనీ దానిని తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. అయితే తరిమేందుకు ఎంత ప్రయత్నం చేసినా ప్రీతి జింటా చుట్టే తిరగడం చూసే వారికి ఫన్నీగా కనిపించింది.

అయితే తన వ్యాయామాన్ని ఆపివేసి తన పెంపుడు కుక్కతో ప్రీతి జింటా కుస్తీ పట్టింది. ప్రేమగా గొడవపడుతూ పెంపుడు కుక్కను రెచ్చకొట్టింది. ఆ వీడియోను షేర్ చేస్తూ.. నీకు ఏ పనినైనా నిష్టగా చేయాలనుకొంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరూ ఆపలేరు. నా పెంపుడు కుక్ర బ్రూనో నా ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ప్రయత్నించింది. అయితే నా పతి పరమేశ్వర్ నా పుష్ అప్స్‌ను ఫినిష్ చేసేలా చేశారు. దీనిని బట్టి నేను ఒకటే చెప్పాలనుకొన్నాను. జిమ్ ఉన్నా లేకపోయినా వ్యాయామాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి అంటూ ప్రీతీ తన పోస్టులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











