twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ల్యాబ్‌లో మురిగిపోయే సినిమా అని వాగారు.. వాళ్లకు జవాబు ఇదే.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

    |

    పారిజాత మూవీ క్రియేషన్స్‌ పతాకంపై రాజేష్‌కుమార్‌, ప్రజ్వాల్‌ జంటగా టి. అంజయ్య సమర్పణలో ఈశ్వర్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ప్రేమ అంత ఈజీ కాదు'. టి.నరేష్‌, టి.శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ టీ అంజయ్య చిత్ర యూనిట్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ ఈశ్వర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

    సెన్సార్ అధికారుల ప్రశంసలు

    సెన్సార్ అధికారుల ప్రశంసలు

    అనంతరం, సమర్పకులు టీ అంజయ్య మాట్లాడుతూ ప్రేమ అంత ఈజీ కాదు సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. మా సినిమా చూసి సెన్సార్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మా చిత్రానికి యూ సర్టిఫికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా మా సినిమాను రూపొందించాం. అందుకు సెన్సార్ ప్రశంసలు లభించడం మాకు మరింత మనోధైర్యాన్ని ఇచ్చింది. మా సినిమా విజయం సాధిస్తుందనే అంశానికి మరింత విశ్వాసం కలిగింది అని అన్నారు.

     రక్తి కట్టించే పలు పాత్రలతో

    రక్తి కట్టించే పలు పాత్రలతో

    హీరో రాజేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రేమ అంత ఈజీ కాదు సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఫ్యామిలీ అంతా చూసే విధంగా ఉన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. యూ సర్టిఫికెట్ ఇస్తూ అభినందించారు. మహకవి శ్రీశ్రీ చెప్పిన ప్రకారం.. ‘ఏ నటుడు చేసిన రక్తి కట్టించే పాత్రలు ఉన్నాయి. పాత్ర అయినా రక్తికట్టించే నటులు ఉన్నారు' అన్నారు. మా సినిమా రెండో వ్యాఖ్యకు సరిపోతుంది. చాలా కష్టపడి సినిమాను అద్భుతంగా తీసుకొచ్చాం. తప్పుకుండా విజయం సాధిస్తుందనే భరోసా ఉంది అన్నారు.

    కొందరు చెడుగా వాగారని

    కొందరు చెడుగా వాగారని

    దర్శకుడు ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో యూ సర్టిఫికెట్ వచ్చే చిత్రాలు కనిపించడం లేదు. మా సినిమాకు యూ సర్టిఫికెట్ రావడం సంతోషంగా ఉంది. ప్రేమ అంత ఈజీ కాదు మా టైటిల్. అయితే మేము సిని నిర్మాణంలో దిగిన తర్వాత సినిమా తీయడం కూడా ఈజీ కాదు అని తెలిసింది. సినిమా మొదలైన తర్వాత కొందరు చాలా తప్పుగా మాట్లాడారు. ప్రసాద్ ల్యాబ్‌లో మురిగిపోయే మరో సినిమా అని కొందరు వాగారు. ఎవరైనా ఏదైనా చేస్తే సహకరించకపోయినా.. ఇలా దెబ్బ తీసే విధంగా మాట్లాడొద్దు. ఏదిఏమైనా మేము అనుకొన్న ప్లాన్ ప్రకారం మార్చి 29న రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

     నిర్మాతల స్పందన ఇదే

    నిర్మాతల స్పందన ఇదే

    నిర్మాతలు శ్రీధర్, నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రేమ నేపథ్యంలో సాగే కథ ఇది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలిపే సినిమా ఇది. ఖోఖో'. ప్లాష్‌ న్యూస్‌, ‘వెతికా నేను నా ఇష్టంగా' వంటి చిత్రాలతో నటుడిగా నిరూపించుకున్న రాజేష్‌కుమార్‌ ఇందులో అద్భుతంగా నటించారు. కన్నడలో మూడు విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రజ్వాల్‌ పువ్వామా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది'' అని చెప్పారు.

    English summary
    Prema Antha Easy Kadu is a love, romantic movie. Directed by Eshwar. Presented by T Anjaiah. Produced by T Naresh, T Sridhar. Rajesh Kumar and Prajwal are lead. Director Eshwar made sensational comments in teaser release function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X