‘ప్రేమకు రెయిన్ చెక్’ సినిమా టైటిల్ అర్థం అదేనంట!

By Bojja Kumar

'ప్రేమ‌కు రెయిన్ చెక్‌'... త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు సినిమా. అయితే చాలా మందికి ఈ సినిమా టైటిల్ వెనక అర్థం ఏమిటో తెలియడం లేదు. సెప్టెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన చిత్ర హీరో అభిలాష్ టైటిల్ విషయంలో నెలకొన్న సందేహాలను తీర్చారు. స్టోన్ మీడియా ఫిల్మ్ బ్యాన‌ర్‌లో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్ఫణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆకెళ్ళపేరి శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి నిర్మిస్తున్నారు.

సినిమా గురించి హీరో అభిలాష్ మాట్లాడుతూ.. ప్రేమ‌కు రెయిన్ చెక్ అంటే ఏదో మేము డిఫ‌రెంట్‌గా ఉండాలి కొత్త‌గా ఉండాల‌ని ఏమీ పెట్ట‌లేదు. సినిమా చూస్తే మీకు అర్ధ‌మ‌వుతుంది. రెయిన్ చెక్ అంటే భ‌విష్య‌త్తులో పూర్త‌య్యే ప్ర‌మాణం. ఈ చిత్రంలో ర‌మ్య అనే క్యారెక్ట‌ర్ చేసే ప్రియా త‌న‌కు రెయిన్ చెక్ ఇచ్చే అల‌వాటు ఉంటుంది. అంటే ఎవ‌రైనా ఒక‌రికి హెల్ప్ చేస్తే మ‌నం దానికి ప్ర‌తిఫ‌లం ఏదైనా చెయ్యాల‌నుకుంటాం క‌దా. కానీ ఆ అమ్మాయి ప్ర‌స్తుతం నాకు ఏమీ చెయ్య‌ద్దు భ‌విష్య‌త్తులో ఏదైనా కావ‌ల్సివ‌స్తే త‌ప్ప‌కుండా అడుగుతాను అంటుంది. రెయిన్ చెక్ అంటే అదే.'' అని తెలిపారు.

 Premaku Raincheck to release on September 7

ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ పేరు విక్కీ. చాలా సిన్సియ‌ర్ క్యారెక్టర్. అంద‌రికి హీరోయిన్‌ రెయిన్ చెక్ ఇస్తే నేను ఈ అమ్మాయికి రెయిన్ చెక్ ఇస్తా. నాకు జీవితంలో ఒక ఫిలోస‌ఫీ ఉంటుంది. నేను ఆఫీస్‌లో ఉండ‌గా ల‌వ్, రొమాన్స్ లాంటివి పెట్టుకోకూడ‌దు ఒక వేళ పెట్టుకుంటే దానివ‌ల్ల కెరీర్ డిస్ట్ర‌బ్ అవుతది అన్న‌ది నా ఫిలాస‌ఫీ. నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాక ఆ అమ్మాయితో ప‌రిచ‌యం అవుతుంది. నేను ఆ అమ్మాయికి రెయిన్ చెక్ ఇస్తా. నాకు ప్రేమ ఉంది కానీ భ‌విష్య‌త్తులో నేను నిన్ను ప్రేమించ‌వ‌చ్చు. లేక వేరే అమ్మాయిని ప్రేమించ‌వ‌చ్చు అని అందుకే ప్రేమ‌కు రెయిన్‌చెక్‌... అని అభిలాష్ తెలిపారు.

యుస్‌లో ఎక్కువగా రెయిన్ చెక్ అనే ప‌దాన్ని వాడ‌తారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు బ‌ట్ట‌ల కొట్టుకు వెళితే అక్క‌డ మీకు కావ‌ల్సిన విధంగా దొర‌క‌క‌పోతే వాళ్ళు మీకొక కార్డు ఇస్తారు. రెయిన్‌చెక్ మీరు భ‌విష్య‌త్తులో ఎప్పుడైనా ఆ కార్డును చూపించి కొనుక్కోవ‌చ్చు. అదేవిధంగా క్రికెట్ ఆడుతుంటారు స‌డెన్‌గా వ‌ర్షం ప‌డుతుంది సో అక్క‌డ రెయిన్ చెక్ ఇస్తారు. అంటే ఎప్పుడైన ఫ్యూచ‌ర్‌లో రండి వ‌చ్చి చూడండి అని... అర్థం.

ఈ సినిమాలో అదృష్టం ఏంటంటే మా డైరెక్ట‌రే ప్రొడ్యూస‌ర్‌. ప్రేమ‌కు రెయిన్ చెక్ అన్న‌ది అయ‌న విజ‌న్ ఆయ‌న ఎలాగైతే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకున్నారు అదే విధంగా తీశారు. ఇప్ప‌టికే నేను చాలా సార్లు చెప్పాను. గ‌తంలో కూడా నేను చెప్పాను నా క్యారెక్ట‌ర్ ఎడ్వెంచ‌ర్స్ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబ‌ట్టి దానికి సంబంధించి ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కోసం ఆయ‌న డెహ్రాడూన్ తీసుకువెళ్ళారు . డెహ్రాడూన్‌లో రెండు వారాల షెడ్యూల్ అది మూడు, నాలుగు లొకేష‌న్స్‌లో తీశారు. కొత్త మొహాలంద‌రితో క‌లిసి సినిమా తియ్య‌డ‌మంటేనే గ్రేట్ అటువంటిది ఆయ‌న యూనిట్ మొత్తం 60 మెంబ‌ర్స్‌ని డెహ్రాడూన్ తీసుకువెళ్ళి. ఒక మూవీకి షెడ్యూల్ చెయ్య‌డం అన్న‌ది గ్రేట్‌. ఆయ‌నే ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ కాక‌పోయుంటే ఈ పాట‌ను ఇక్క‌డ కెబిఆర్ పార్క్‌లో తీసేసేవారు.

ప్రేమ‌కు రెయిన్ చెక్ కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్‌టెయిన‌ర్‌. అంటే మా డైరెక్ట‌ర్‌గారు సినిమా తియ్యాల‌నుకున్న‌పుడు 150రూపాయ‌లు పేచేసి ఒక సినిమా చూసే ప్రేక్ష‌కుడికి ఎలాంటి ఆహ్లాదాన్ని అందించాలో అటువంటిదే ఆయ‌న చేసిన సినిమా. పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆర్టిస్టుల న‌ట‌న అన్నీ బావుంటాయి. డెఫినెట్‌గా డిజ‌ప్పాయింట్ మాత్రం చెయ్య‌వు. ఈ చిత్రంలోని న‌టీన‌టులుకూడా ఎవ్వ‌రూ కొత్త‌గా అనిపించ‌రు. ఈ చిత్రంలో మొయిన్ క్యారెక్ట‌ర్స్ మూడు. మొత్తం ఎనిమిది క్యారెక్ట‌ర్లు. హీరో సుమ‌న్‌గారు, ర‌ఘుగారు బిగ్‌బాస్ షోలో గిరీష్‌గారు వీళ్ళంద‌రూ చేశారు... అని అభిలాష్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X