బీఎండబ్ల్యూలో ఇద్దరు బికినీ పోరీలు.. ప్రతీ ఇంట్ల ఇదే లొల్లి.. పరేషాన్ చేస్తున్న ప్రెషర్ కుక్కర్ టీజర
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు రియాలిటీకి మరీ దగ్గరగా ఉంటున్నాయి. రోజూ మనం చూసే సంఘటనలే సినిమాలుగా మార్చేసి సక్సెస్ అవుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. చిన్న సినిమాలుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని రియాలిటిక్ సినిమాలు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ప్రెషర్ కుక్కర్' అనే డిఫెరెంట్ టైటిల్‌తో మరో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
కరంపూరి క్రియేషన్స్ అండ్ మిక్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రెజర్ కుక్కర్ సినిమాలో సాయి రొనాక్, ప్రీతి అష్రాని జంటగా నటిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సుజై, సుశీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కొత్తగా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టడం విశేషం.

ఇటీవలే విడుదలైన ఈ ప్రెజర్ కుక్కర్ సినిమా ఫస్ట్ లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదే జోష్‌లో తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముగ్గురు స్నేహితులు.. వారి చదువులు, ఉద్యోగం నేపథ్యంలో కనిపించిన కొన్ని సన్నివేశాలు ఈ టీజర్‌లో హైలైట్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు, రియాలిటీకి బాగా దగ్గరగా వెళ్లి ఈ సినిమా రూపొందించినట్లుగా తెలుస్తోంది.
తండ్రి కోరిక మేరకు బలవంతంగా విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడి కథను సినిమాగా మలిచారని ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో బుర్రకథ, బీఎండబ్ల్యూలో ఇద్దరు బికినీ పోరీలు అంటూ వస్తున్న డైలాగ్స్ ఈ టీజర్ లెవెల్ పెంచేశాయి. ఇక 'ప్రతీ ఇంట్ల ఇదే లొల్లి' అనే ట్యాగ్ లైన్ మరింత ఆసక్తికరంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలోచన.. నవంబర్ నెలలో ప్రెషన్ కుక్కర్ ప్రెషర్ చూసేందుకు రెడీకండి.


Click it and Unblock the Notifications











