తెలుగు సినిమాను మరో స్థాయికి .. ప్రధాని మోదీ నోట అక్కినేని మాట

'ప్రధాని నరేంద్ర మోడీ నోట అక్కినేని నాగేశ్వరరావు మాట' ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమండీ. ప్రధాని మోడీ స్వయంగా తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఈ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఇంతకీ అక్కినేని గారి గురించి ప్రధాని మోడీ ఏమన్నారంటే?

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం మాన్ కి బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా ఇవాళ 117వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో భాగంగా తన మనసులో ఉన్న విషయాలను ప్రధాని మోడీ దేశ ప్రజలతో పంచుకున్నారు ఈ క్రమంలోనే ఒకప్పటి టాలీవుడ్ అగ్ర హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు గురించి వారి సేవలను గురించి కొనియాడారు.

Prime Minister Narendra Modi paid tribute to the late actor Akkineni Nageswara Rao in Mann Ki Baat

ప్రధాని నరేంద్ర మోడీ నోట అక్కినేని నాగేశ్వరరావు పేరు వచ్చింది. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తం చేశాడంటూ ప్రశంసలు కురిపించాడు. అలాగే తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడంటూ పొగడ్తలు కుమ్మరిచ్చారు. నాగేశ్వరరావు తెలుగు సినిమాకు చేసిన మహోన్నత కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆయన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు విలువలు చక్కగా ప్రతిబింబించారని పేర్కొన్నారు.

అలాగే బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా, రాజ్ కపూర్ పేర్లను కూడా గుర్తుకు చేశారు.ప్రధాని మోడీ మాట్లాడుతూ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందంటూ ప్రశంసించారు. వారు సున్నితమైన అంశాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించారంటూ ప్రధాని మోడీ గుర్తుకు చేశారు. అలాగే వచ్చే ఏడాది ప్రపంచంలోని ప్రముఖ మీడియా వినోద రంగా నేతలలో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగం వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.

'ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌' పేరుతో దేశ ప్రగతికి, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో భారతీయ చలనచిత్ర, వినోద పరిశ్రమ గణనీయమైన కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసించారు. 2024లో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన దిగ్గజ వ్యక్తులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఎంతో మంది నటులు చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సిరీస్ యొక్క రెండవ సీజన్ ప్రత్యేకంగా ప్రారంభించబడిందని ప్రధాని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X