పవర్‌ఫుల్ విలన్‌గా ప్రిన్స్.. సిక్స్‌ప్యాక్‌తో బోయపాటి మూవీలో!
టాలీవుడ్‌లో టాలెంట్ పుష్కలంగా ఉన్ననటుల్లో యువ హీరో ప్రిన్స్ ఒకరు. ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్‌లో నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత బస్ స్టాప్ సినిమాతో సోలో హిట్ అందుకొన్నారు. రొమాన్స్, నేను శైలజ, వేర్ ఈజ్ విద్యాబాలన్, అశ్వత్తామ, డీజే టిల్లు లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకొన్నాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు.
ప్రిన్స్ విషయానికి వస్తే.. ఒకవైపు హీరో పాత్రలే కాకుండా క్యారెక్టర్, విలన్, గ్రే షేడ్ ఉన్న పాత్రలతో ఆకట్టుకొంటున్నాడు. తాజాగా సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం.

అఖండ సినిమా తర్వాత బోయపాటి రూపొందిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో ప్రిన్స్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. పవర్ ఫుల్ విలన్ పాత్రతో ఆలరించేందుకు సిద్దంగా ఉన్నాడు. బోయపాటి మార్కు తరహా విలనిజాన్ని పండించేందుకు రెడీ అవుతున్నాడు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రామ్, బోయపాటి చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది.

ఇదిలా ఉండగా, ప్రిన్స్ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్ అవుతున్నది. సిక్స్ ప్యాక్‌తో ప్రిన్స్ ఉన్న ఫోటోలు యూత్‌ను ఆకట్టుకొంటున్నాయి. బోయపాటి మూవీతో ప్రిన్స్ మరో రేంజ్‌కు చేరుకొంటారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











