1100 కోట్ల సినిమా మిస్.. ఆయన్ని తక్కువ అంచనా వేసిన పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. తన నటనతో ఇక్కడ కూడా అభిమానులను పొందగలిగారు. ఇప్పటికే మాలివుడ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కు నటుడిగా దర్శకుడిగా మంచి పేరు దక్కింది. 2019లో దర్శకత్వం వహించిన పొలిటికల్ యాక్షన్ మూవీ లూసిఫర్ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా L2 : ఎంపురాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ అయింది.
ఎంపురాన్ చిత్రానికి విశేష స్పందన లభిస్తుంది. మలయాళం తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈరోజు గ్రాండ్గా థియేటర్లలో విడుదల అయింది. మొదటిరోజు పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సలార్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ కు దీటుగా పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫామెన్స్ కనిపిస్తుంది. అంతేకాదు యాక్షన్ సీన్లలోను పృథ్వీరాజ్ సుకుమారన్ ఇరగదీశారు.

సలార్ చిత్రంతో పృథ్వీరాజ్ సుకుమారన్ నటనలోనే కాదు యాక్షన్ లోను దుమ్ము లేపగలడని దేశవ్యాప్తంగా రుజువు చేశారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారం నుంచే భారీ యాక్షన్ ఫిలిం ఒకటి రావలసి ఉండింది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే క్రేజీ ప్రాజెక్ట్ లు బ్యాక్ టు బ్యాక్ మిస్ అయ్యాయి. ఆ ప్రాజెక్టు ఏదో కాదు.. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్, లియోచిత్రాలు కావడమే విశేషం. ఈ రెండు చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ము లేపాయి.
లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కమలహాసన్ పాత్రలో కనిపించాల్సింది. కానీ అప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రాజెక్టుల వల్ల ఆ ఛాన్స్ వదులుకున్నారంట. ఇక దాని తర్వాత కూడా లియోచిత్రంలోనూ నటించే అవకాశాన్ని లోకేష్ కనకరాజు అందించినప్పటికిని పృధ్వీరాజ్ సుకుమారనే వదులుకోవాల్సి వచ్చిందంట. ఆ ప్రాజెక్ట్స్ ప్రారంభానికి ముందు నుంచే లోకేష్ కనగరాజు తన స్టోరీ ఐడియాస్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ తో చెప్పుకునే వారంట. కానీ అప్పుడు పృథ్వీరాజ్ తెలియక వదిలేసానని రీసెంట్ గా గుర్తు చేసుకున్నారు.
అయితే లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 450 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక లియో చిత్రం బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా ఈ రెండు చిత్రాలు కలిపి బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. ఇక ముందే పృథ్వీరాజ్ ఈ చిత్రాలకు ఓకే చెప్పి ఉంటే ఆ రికార్డులను తన ఖాతాలో వేసుకొని ఉండేవారు. ఇక నెక్స్ట్ లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాలేక పోయినప్పటికీ.. మరో సెపరేట్ చిత్రంలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఓపెన్ గా చెప్పారు. ఇక నెక్ట్స్ ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ఎంబీ29లో కీలక పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











