twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లూసిఫర్ దర్శకుడి బృందానికి షాక్.. మరో వ్యక్తికి కరోనా వైరస్

    |

    లూసిఫర్ దర్శకుడు పృథ్వీరాజ్‌కు మరో షాక్ తగలింది. ఆడు జీవితం అనే సినిమా కోసం జోర్డాన్ వెళ్లి ఎడారిలో చిక్కుపోయిన చిత్ర యూనిట్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. అనంతరం చిత్ర యూనిట్‌ను 14 రోజులు క్వారంటైన్‌కు తరలించారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌తోపాటు దర్శక, నిర్మాత, నటుడు పృథ్వీరాజ్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకొన్నారు.

    ఇదిలా ఉండగా, మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పృథ్వీరాజ్ బృందంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. జోర్డాన్ పర్యటనలో ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన వ్యక్తికి కరోనా సోకింది. అలాగే చిత్ర యూనిట్‌లో సభ్యుడైన మరోవ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అనే విషయం తాజాగా బయటపడింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో 58 మంది యూనిట్ సభ్యులు అక్కడే ఉండిపోయారు. వందే భారత్ మిషన్ ద్వారా భారత్ చేరుకొన్న యూనిట్ సభ్యులు మే 22 నుంచి క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా మరో వ్యక్తికి కరోనా సోకడంతో కున్నమ్‌కులం తాలూకా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

    Prithviraj Sukumarans another team member gets tested Corona Positive

    ఆడుజీవితం అనే చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు. బెన్యమిన్ అనే రచయిత రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్, అపర్ణ బాలమురళి, వినీత శ్రీనివాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    English summary
    Prithviraj Sukumaran reunited with Family after he tests coronavirus negative. He was stranded in Wadi Rum desert in Jordan in lockdown with 58 members unit of Aadujeevitham. Recently he was reached to Kerala. Recent Reports suggest that, another two members tested positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X