»   » అందాలభామ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్.. ఎవరితోనంటే..

అందాలభామ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్.. ఎవరితోనంటే..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి... తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. అయితే తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న "సిరివెన్నెల" అనే చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుంది.

    తెలుగు చిత్ర సీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే "సిరివెన్నెల" సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రియమణి చాలా కథలు విన్నప్పటికీ "సిరివెన్నెల" కథ బాగా నచ్చడం పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది.

    Priya Mani second inning with Sirivennela

    ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు... జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

    ప్రస్తుతం ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో ఓ డ్యాన్స్ షోకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కన్నడలో కూడా కొన్నికార్యక్రమాలు చేస్తున్నారు. అడపదడపా తెలుగు టెలివిజన్ ఛానెల్లో పలు కార్యక్రమాల్లో పాలుపంచుకొంటున్నారు.

    English summary
    Actor Priya Mani away from the silver screen for sometime. After marriage, She is thinking for story to perfect re entry. Now, she chosen Sirivennela as second Innings in Tollywood.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more