ప్రియా ప్రకాశ్ వారియర్‌తో రామ్ రొమాన్స్: అలా సెట్ చేస్తున్న కోలీవుడ్ డైరెక్టర్
ఆ మధ్య సరైన హిట్ లేక బాధ పడినప్పటికీ.. పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్'తో కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇక, దాని తర్వాత అంటే ఈ సంక్రాంతికి 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడతను. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం కూడా భారీ హిట్ అయింది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న రామ్.. ఇటీవలే మరో సినిమాను ప్రకటించాడు. తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది.
రెండు హిట్ల తర్వాత రామ్ పోతినేని.. తమిళ దర్శకుడు లింగుసామీతో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కీలక పాత్రను పోషిస్తుందట. ఇప్పటికే ఆమెతో చిత్ర యూనిట్ చర్చలు కూడా జరిపిందని తెలుస్తోంది. ఈ కథ బాగా నచ్చడంతో ఆమె వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్‌ను తీసుకుంటున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రియ వారియర్‌ను తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఇది త్వరలోనే విశాఖపట్నంలో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











