ఒక్క ముక్క తెలుగు రాదు. జీరో బ్యాలెన్స్ ఉన్నా.. ఎలాగోలా డబ్బు తెచ్చి..: ప్రియదర్శి

యువ నటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన కామెడీ చిత్రం 'మిఠాయి'. ఈ సినిమా ద్వారా ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించిన చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 22న విడుదలకు సినిమా ముస్తాబవుతున్నది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది.

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని 'హుషారు' దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి స్వీకరించారు.

ఈ ఆడియో ఆవిష్కరణలో నటులు షఫీ, కమల్ కామరాజు, ఎడిటర్ గ్యారీ బి.హెచ్, కొరియోగ్రఫర్ యానీ తదితరులు పాల్గొన్నారు.

 జీరో బ్యాలెన్స్ ఉన్నా

జీరో బ్యాలెన్స్ ఉన్నా

సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ "నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా... షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ... అందరూ ఎంతో హెల్ప్ చేశారు" అన్నారు.

 నన్ను నిర్మాతను చేసింది

నన్ను నిర్మాతను చేసింది

సినిమా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ "నేను ఓ డాక్టర్. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నర పాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు" అన్నారు.
చిత్రసంగీత దర్శకుడు వివేక్ సాగర్ మాట్లాడుతూ "ప్రేక్షకులందరూ ఈ నెల 22న థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారని అనుకుంటున్నా. మధ్యలో టైమ్ ఉంటే ఆడియో కూడా వినండి" అన్నారు.

డార్క్ కామెడీతో సినిమా

డార్క్ కామెడీతో సినిమా

ప్రియదర్శి మాట్లాడుతూ "ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు.

తెలుగు రాదు కానీ

తెలుగు రాదు కానీ

సెట్స్ లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేది కాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం" అని ప్రియదర్శి అన్నారు.

 తెలుగులో డార్క్ కామెడీ వచ్చి

తెలుగులో డార్క్ కామెడీ వచ్చి

శ్వేతా వర్మ మాట్లాడుతూ "తెలుగులో డార్క్ కామెడీ సినిమాలు వచ్చి చాలా రోజులు అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను" అన్నారు.

అదితి మ్యాకల్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నా రోల్ చాలా చిన్నది. అతిథి పాత్ర లాంటిది. నాకు ఆ పాత్ర చాలా నచ్చింది. షూటింగ్ చేసిన రెండు రోజులు చాలా చాలా ఎంజాయ్ చేశా" అన్నారు.

నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు, సాంకేతికవర్గం


ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవి వర్మ, అజయ్ ఘోష్, అర్ష, శ్వేతా వర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా
పీఆర్వో: నాయుడు-ఫణి,
ఛాయాగ్రహణం: రవివర్మన్ నీలమేఘం,
సంగీతం: వివేక్ సాగర్,
ఎడిటర్: గ్యారీ బి.హెచ్,
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ,
మాటలు: ప్రశాంత్ కుమార్, బి. నరేష్,
నిర్మాత: డాక్టర్ ప్రభాత్ కుమార్,
దర్శకత్వం: ప్రశాంత్ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X