టాలీవుడ్ హీరో మెడకు అలేఖ్య చిట్టి వివాదం .. ఆడపిల్లల్ని వదలరా అంటూ..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారిన అంశం అలేఖ్య చిట్టి పికిల్స్. ఆన్‌లైన్‌లో ఈ వ్యవహారం ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా వీరి గురించే.. ఇక వీరిని బేస్ చేసుకుని రీల్స్, వీడియోలు, ఫన్నీ స్పూఫ్స్‌కు లెక్కేలేదు. ఈ వివాదంతో ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ల పేరు మారుమోగుతోంది. చివరికి సినిమా వాళ్లు కూడా ఈ వివాదాన్ని తమ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. అయితే ఈ ఇష్యూ ఓ తెలుగు హీరో మెడకు చుట్టుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల. వీరు ముగ్గురు కలిసి గోదావరి జిల్లాల్లో ఫేమస్ అయిన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్‌తో చేసే పచ్చళ్లు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. పచ్చళ్ల అమ్మకాలతో పాటు పికెల్స్ తయారీ, కలిపే విధానానికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ఇలా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతున్న దశలో ఇటీవల ఓ వినియోగదారుడితో అలేఖ్య చిట్టి జరిపిన సంభాషణ వివాదాస్పదమైంది.

పచ్చళ్ల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలని ఓ వ్యక్తి కోరాడు. దీనిపై సీరియస్ అయిన అలేఖ్య చిట్టి పచ్చళ్లే కొనలేని వాడివి రేపు భార్యకు బంగారం ఏం కొంటావ్, ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు అని అనుచిత వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరి సంభాషణ తాలుకూ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ దెబ్బతో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. వ్యాపారం చేయాల్సింది ఇలాగేనా? ముందు కస్టమర్లను గౌరవించడం నేర్చుకోమంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంటా బయటా, మీడియాలో తమపై వస్తున్న విమర్శలతో అలేఖ్య చిట్టి సిస్టర్స్ సంజాయిషీ ఇచ్చారు. ఈ వివాదానికి కారణమైన అలేఖ్య సైతం క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ట్రోలింగ్ ఆగకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని సుమ కంచర్ల వీడియో ద్వారా తెలియజేశారు. కాగా.. తెలుగునాట ఇంతటి చర్చకు దారి తీసిన అలేఖ్య చిట్టి వ్యవహారాన్ని నటుడు ప్రియదర్శి తన కొత్త సినిమా సారంగపాణి జాతకం ప్రమోషన్స్ కోసం వాడుకున్నాడు. అయితే దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రియదర్శి క్లారిటీ ఇచ్చారు.
సారంగపాణి జాతకం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా నుంచి ఆయనకు అలేఖ్య చిట్టి వీడియోపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో ప్రియదర్శి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న మేజర్ ఇష్యూ ద్వారా సినిమాను ప్రమోట్ చేయాలని అనుకున్నామని తెలిపారు. అంతే తప్పించి తాము పచ్చళ్లు చేసే వారి గురించి కానీ, ఆ అమ్మాయిల గురించి కానీ ఎక్కడా కామెంట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియదర్శి చేసిన వ్యాఖ్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాగా.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రూప కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











