అప్పుడు నా సావునేను సస్తా నీకెందుకు..ఇప్పుడు నా బతుకు నేను బతుకుతా!
పెళ్లిచూపులులో అంకుల్.. నా సావు నేను సస్తా నీకెందుకు.. అనే డైలాగుతో పాపులర్ అయిన కమెడియన్ ప్రియదర్శి, ఇటీవల జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదివిన ప్రియదర్శి తాను ఎప్పుడూ కమెడియన్ అవుతానని అనుకోలేదట, కానీ అనుకోకుండా వచ్చిన అవాకాశంతో ఆయన కమెడియన్ గా స్థిర పడిపోయాడు. అయితే ఆయనకు నటనతో మెప్పించే విలన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉండేదట. ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావులాగా గొప్ప విలన్ అని అనిపించుకోవాలని ఉండేదేని అందుకే ఆయన చేసిన మొదటి రెండు సినిమాలయిన టెర్రర్, బొమ్మల రామారంలో విలన్‌గానే నటించారట.
అయితే ఆ తర్వాత ఎవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడంతో, తన ఫ్రెండ్ అయిన తరుణ్ భాస్కర్ సినిమా పెళ్లిచూపులులో కామెడీ రోల్ చేశాడట. అప్పటి నుంచీ అదే క్లిక్ అయిందని, దాంతో కమెడియన్‌గా స్థిరపడ్డాననీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక అప్పుడు ఆ డైలాగ్ తో ఫేమస్ అయిన ప్రియదర్శి ఇప్పుడు అదే డైలాగ్ ను మార్చి పలుకుతున్నాడు. నా బతుకు నేను బతుకుతా నా అవసరం అంటున్నాడు. అసలు విషయం ఏమిటంటే కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం కరోనా బారినపడుతున్నారు. అలాగే సామాన్య ప్రజలు సైతం ఆక్సిజన్ సిలిండర్లు దొరకక, మందుల కొరత నేపథ్యంలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించాలి అని కోరుతూ ఆ మేరకు వితౌట్ మాస్క్ విత్ మాస్క్ రెండు ఫోటోలు పెట్టి కాప్షన్ పెట్టాడు. ప్రస్తుతానికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ మధ్య కాలంలో జాతి రత్నాలు అనే సినిమాతో ప్రియదర్శి సూపర్ హిట్ అందుకున్నాడు. నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. స్వప్న సినిమా బ్యానర్ మీద నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక ప్రియదర్శి లీడ్ రోల్ లో రూపొందించిన కంబాలపల్లి కథలు చాప్టర్ వన్ మెయిల్ ఎపిసోడ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాని న్యూయార్క్ ఇండియా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











