మరి ఏం పీకమంటావ్? నెటిజన్‌‌ ప్రశ్నకు నటుడు ప్రియదర్శి మాస్ రిప్లయ్

నటీనటులు, ఇతర సినీ ప్రముఖులు తమ అభిమానుతో నిరంతరం టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగిస్తున్నారు. తమ సినిమాలు, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత వివరాలతో పాటు ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటారు. కొందరికి వీలున్నప్పుడల్లా అభిమానులతో లైవ్ చాట్ నిర్వహిస్తుంటారు. అయితే కొందరు ఆకతాయిల వల్ల స్టార్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హీరోయిన్లను వారి వ్యక్తిగత జీవితం గురించి ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతూ వేధిస్తున్నారు. ఇక ఈ లిస్ట్‌లోకి హీరోలు కూడా వస్తున్నారు. తాజాగా ఇలాంటి పరిస్ధితి ఎదుర్కొన్నారు నటుడు, కమెడియన్ ప్రియదర్శి. ఈ వివరాల్లోకి వెళితే..

నటుడిగానూ గుర్తింపు
కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియదర్శి... మల్లేశం, బలగం, కోర్ట్ తదితర చిత్రాలతో తనలోని నటుడిని పరిచయం చేశారు. సినిమాలోని పాత్ర కోసం తనను తాను మలుచుకోవడాన్ని బట్టి ఆయన అంకితభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మల్లేశం సినిమా కోసం తెలంగాణ యాసను, బాడీ లాంగ్వేజ్‌ను, మగ్గం నేతను నేర్చుకున్నారు. ఈ సినిమాలోని నటనకు గాను ఆయనకు ఎంతో గుర్తింపు లభించింది. కమెడియన్‌గా రెగ్యులర్‌గా చేస్తూనే నటనకు స్కోప్ ఉన్న పాత్రలు లభించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రియదర్శి.

Priyadarshi Pulikonda strong counter to netizen during live chat

ప్రేమంటేతో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ప్రియదర్శి నటిస్తోన్న చిత్రం ప్రేమంటే. ఇందులో ఆయన సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్టార్ యాంకర్ సుమ కనకాల, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి జంట అతిథి పాత్రల్లో సందడి చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ లభిస్తుండటంతో చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది. ప్రియదర్శి ఖాతాలో మరో హిట్ ఖాయమని అంటున్నారు.

గడ్డి పీకమంటావా?
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియదర్శి.. అభిమానులతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాడు. తాజాగా ప్రేమంటే విడుదల సందర్భంగా ఎక్స్‌లో లైవ్ చాట్ నిర్వహించాడు ప్రియదర్శి. అభిమానుల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తుండగా.. ఓ నెటిజన్ మాత్రం ఓవరాక్షన్ చేశాడు. అన్నా.. నువ్వు సినిమాలు తీయడం ఆపేయ్, ప్లీజ్ అన్నా అని రాసుకొచ్చాడు. దాంతో సీరియస్ అయిన ప్రియదర్శి.. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకల్నా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది. కొందరు ప్రియదర్శిని సమర్ధిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన కాస్త సంయమనం పాటించాల్సిందని కామెంట్స్ పెడుతున్నారు.

వివాదాల్లో ప్రియదర్శి
స్వతహాగా మృదుస్వభావి అయిన ప్రియదర్శి.. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైనప మిత్రమండలి సినిమా విడుదల సమయంలోనూ ప్రియదర్శి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఒకవేళ ఈ సినిమా నచ్చకపోతే.. హిట్ కాకపోతే తర్వాత వచ్చే నా సినిమాను చూడొద్దని సవాల్ విసిరారు. అయితే మిత్రమండలి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మిత్రమండలి సినిమా టైంలో తాను అన్న మాటలపై ప్రియదర్శి క్షమాపణలు చెప్పారు. ఆ మాటల్ని నేను అనకుండా ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X