Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అది జాగ్రత్తగా విప్పండి.. ప్రియమణి పోస్ట్ వైరల్
ప్రస్తుతం ఓటీటీ ప్రేమికులు ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రియమణి, మనోజ్ భాజ్‌పేయి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఓ రేంజ్లో హిట్ అయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యామిలీ మెన్‌కు గుర్తింపు వచ్చింది. ఉగ్రవాదం నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కించిన ఫ్యామిలీమెన్లో మనోజ్ భాజ్‌పేయి సీక్రెట్ ఏజెంట్‌గా అద్భుతమైన పాత్రను పోషించాడు.
అందులో సందీప్ కిషన్ కూడా ఆర్మీ మేజర్ పాత్రను పోషించాడు. ప్రియమణి కాస్త గ్లామర్ టచ్ ఉన్న గృహిణిగా నటించింది. అయితే మొదటి సీజన్ ఊహించిన దాని కంటే ఎక్కువగా క్లిక్ అవ్వడంతో రెండో సీజన్‌ను భారీ ఎత్తున నిర్మించారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సౌత్ నుంచి సమంత జాయిన్ అయింది. ఇందులో సమంత ఉగ్రవాదిగా నటిస్తోన్నట్టు తెలుస్తోంది.అయితే కొత్త ఏడాదిలో ఫ్యామిలీ మెన్ సీజన్ 2 రాబోతోన్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా ఎదురుచూశారు.. కొత్త ఏడాది సందర్భంగా మీ అందరికీ ఓ బహుమతిని పట్టుకొచ్చాం.. కొంచెం జాగ్రత్తగా, శ్రద్ద పెట్టి విప్పండి.. అంటూ పోస్టర్‌పై ప్రియమణి కామెంట్ చేసింది. బాంబ్‌ను ఫిట్ చేస్తున్న పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేయడం, దానిపై ప్రియమణి కామెంట్ క్లిక్ అవ్వడంతో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.