twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది జాగ్రత్తగా విప్పండి.. ప్రియమణి పోస్ట్ వైరల్

    |

    ప్రస్తుతం ఓటీటీ ప్రేమికులు ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రియమణి, మనోజ్ భాజ్‌పేయి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఓ రేంజ్‌లో హిట్ అయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యామిలీ మెన్‌కు గుర్తింపు వచ్చింది. ఉగ్రవాదం నేపథ్యాన్ని తీసుకుని తెరకెక్కించిన ఫ్యామిలీమెన్‌లో మనోజ్ భాజ్‌పేయి సీక్రెట్ ఏజెంట్‌గా అద్భుతమైన పాత్రను పోషించాడు.

    అందులో సందీప్ కిషన్ కూడా ఆర్మీ మేజర్ పాత్రను పోషించాడు. ప్రియమణి కాస్త గ్లామర్ టచ్ ఉన్న గృహిణిగా నటించింది. అయితే మొదటి సీజన్ ఊహించిన దాని కంటే ఎక్కువగా క్లిక్ అవ్వడంతో రెండో సీజన్‌ను భారీ ఎత్తున నిర్మించారు. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సౌత్ నుంచి సమంత జాయిన్ అయింది. ఇందులో సమంత ఉగ్రవాదిగా నటిస్తోన్నట్టు తెలుస్తోంది.అయితే కొత్త ఏడాదిలో ఫ్యామిలీ మెన్ సీజన్ 2 రాబోతోన్నట్టు ప్రకటించారు.

    Priyamani ABout Family man season 2 update

    ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా ఎదురుచూశారు.. కొత్త ఏడాది సందర్భంగా మీ అందరికీ ఓ బహుమతిని పట్టుకొచ్చాం.. కొంచెం జాగ్రత్తగా, శ్రద్ద పెట్టి విప్పండి.. అంటూ పోస్టర్‌పై ప్రియమణి కామెంట్ చేసింది. బాంబ్‌ను ఫిట్ చేస్తున్న పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేయడం, దానిపై ప్రియమణి కామెంట్ క్లిక్ అవ్వడంతో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

    English summary
    Priyamani ABout Family man season 2 update, Bahot hua intezaar. Aapke liye new year ka tohfa laaye hai. Zara dhyaan se kholna. #The FamilyManOnPrime,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X