సీఎంగా టాలీవుడ్ హీరోయిన్.. ఆమె బాధ్యతను తీసుకున్న అక్కినేని హీరో

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే విజయాలను సొంతం చేసుకుని స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్య ఒకడు. కెరీర్ ఆరంభంలో పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడ్డాడు. అయితే, ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాగ చైతన్య 'లాల్ సింగ్ చద్దా', 'థ్యాంక్యూ' అనే తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఈ రెండూ ఘోర పరాజయాలను చవి చూశాయి.

వరుస ఫ్లాపులు వచ్చినా చైతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తన 22వ ప్రాజెక్టును ప్రకటించాడు. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అంతేకాదు, అప్పుడే ఈ మూవీకి సంబంధించిన పలు షెడ్యూళ్లు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కినేని నాగ చైతన్య మూవీ నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Priyamani CM Role in Naga Chaitanya Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అందులో టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ఒకరు. ఈ సినిమాలో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రను చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆమెను కాపాడే రోల్‌ను హీరో నాగ చైతన్య చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో ప్రియమణి చేసే ఈ సీఎం రోల్ ఎంతో ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె ఆ పాత్రలో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించబోతుందని సమాచారం.

వెంకట్ ప్రభు - నాగ చైతన్య కలయికలో రూపొందనున్న ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రేమీ విశ్వనాథ్, అరవింద స్వామి, శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X