నితిన్ అంధాదున్ రీమేక్‌లో క్రేజీ హీరోయిన్.. రాధికా ఆప్టేను కూడా..
బాలీవుడ్‌లోనే కాకుండా చైనాలో కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అంధాదూన్ మూవీ తెలుగులో రీమేక్ కావడానికి సిద్ధమైంది. యువ హీరో నితిన్ నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రారంభం కాగా కరోనావైరస్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా ప్రియాంక తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక హిందీలో టబు పోషించిన పాత్ర కోసం రాధికా ఆప్టేను రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆమెతో నిర్మాత, చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ లోగా ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలోనే హీరోయిన్ల ఎంపిక విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
అంధాదున్ మూవీని తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై నితిన్ రూపొందిస్తున్నారు. అంతా బాగుంటే ఈ చిత్ర షూటింగ్ జూన్‌లో మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

2018లో వచ్చిన అంధాదున్‌లో ఆయుష్మాన్ ఖురానా నటించగా.. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ అవుతున్నది.
ఇక ప్రియాంక అరుల్ మోహన్ విషయానికి వస్తే తమిళంలో ప్రవేశిస్తున్నారు. తమిళంలో శివకార్తీకేయన్ హీరోగా రూపొందుతున్న డాక్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తన్నారు.


Click it and Unblock the Notifications











