ఆస్కార్ అవార్డుల్లో ప్రియాంక చోప్రాకు నిరాశ!
ఆస్కార్ అవార్డులు 2025 పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అత్యున్నతమైన ప్రతిభను చాటిన సినీ తారలు, ఫిల్మ్ మేకర్స్ అవార్డులను అందుకొన్నారు. అయితే ఈ అవార్డుల వేదికలో భారత్ సందడి కనిపించలేదు. అయితే ఈ సంవత్సరం ఒకే ఒక ఆశ ఉన్న ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా నిర్మించిన అనుజా చిత్రానికి పురస్కారం లభించలేదు. దాంతో భారతీయ అభిమానులు నిరాశ చెందారు. ఈ అవార్డు వివరాల్లోకి వెళితే.
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరిలో భారత్ తరఫున అనుజా అనే షార్ట్ ఫిలిం పోటీ పడింది. అయితే ఈ కేటగిరిలో ఐయామ్ నాట్ ఏ రోబోటో అనే షార్ట్ ఫిలింకు విక్టోరియా వార్మర్ డామ్, ట్రెంట్ సంయుక్తంగా అవార్డు అందుకొన్నారు. అనుజా మూవీకి అవార్డు లభిస్తుందని ఆశించిన వారంతా కొంత అసంతృప్తికి గురయ్యారు.
అనూజ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ప్రియాంక చోప్రా జోనస్, గునీత్ మోంగ, మైండీ కాలింగ్, సుచిత్ర మట్టై తదితరులు నిర్మించారు. ఈ చిత్రానికి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు. హిందీ భాషలో రూపొందిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.
అనుజా సినిమా కథ విషయానికి వస్తే.. అనుజా, పలక్ ఇద్దరు అక్కాచెల్లెలు. వర్మ అనే యజమానికి చెందిన ఓ గార్మెంట్ షాపులో పనిచేస్తుంటారు. అయితే గణిత శాస్త్రంలో అనుజా తెలివితేటలు గ్రహించిన మిశ్రా అనే స్కూల్ టీచర్.. ఆమెను పని వదిలేసి.. చదువుకోవాలని ప్రోత్సహిస్తాడు. అందుకు వర్మ అంగీకరించడు. అనుజాను చదువు కోవడానికి వదలిపెట్టడు. ఆ తర్వాత అనుజా, ఫలక్ లైఫ్‌లో ఏం జరిగిందనేది సినిమా కథ.
ఈ చిత్రంలో సజ్దా పఠాన్ అనూజగా, అనన్య షాన్‌భాగ్ పలక్‌గా, నగేష్ భోంస్లే వర్మగా, గుల్షన్ వాలియా మిశ్రాగా నటించారు. అమెరికన్ హిందీ షార్ట్ ఫిలింగా రూపొందిన ఈ సినిమాలో సినిమా సాంకేతిక నిపుణుల వివరాల్లోకి వెళితే.. ఆకాశ్ రానే సినిమాటోగ్రఫి, క్రుషన్ నాయక్ ఎడిటింగ్, ఫ్యాబ్రిజియో మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

భారత దేశానికి అవార్డు వస్తున్న ఏకైక అవకాశం చేజారింది. ఈ ఏడాది ఇండియా కథ ఆస్కార్ అవార్డుల్లో ముగిసినట్టే అని సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











