Who Is Neelam Upadhyaaya? తెలుగు హీరోయిన్‌తో ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. నీలమ్ గురించి మీకు తెలుసా?

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తన పెళ్లికి సంబంధించిన రోకా ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ప్రియాంక చోప్రా సోదరుడు పెళ్లాడబోతున్న అమ్మాయి తెలుగు హీరోయిన్ కావడంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇంతకు సిద్దార్థ్ పెళ్లాడో అమ్మాయి ఎవరనే విషయంలోకి వెళితే..

అంబానీ ఇంట్లో పెళ్లికి వచ్చిన ప్రియాంక చోప్రా తన భర్త, కూతురుతో కలిసి ఇండియాలో పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తాజాగా తన సోదరుడు సిద్దార్థ్ రోకా ఫంక్షన్ గురించి ఆమె తన అభిమానులతో పంచుకొన్నది. కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టు పెట్టి తన అభినందనలు తెలిపింది.

Priyanka Chopra s Brother Siddharth Chopra wedding with Neelam Upadhyaya

దాంతో సిద్దార్థ్ వివాహం చేసుకొనే అమ్మాయి దక్షిణాదికి చెందిన నీలమ్ ఉపాధ్యాయ్ అనే విషయం బయటకు వచ్చింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వారు డేటింగ్ చేస్తూ సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొద్దికాలంగా వారిద్దరూ వివాహం చేసుకొంటున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఆ వార్తకు బలం మారేలా ప్రియాంక చోప్రా ఇన్స్‌టాగ్రామ్ పోస్టు నిజం చేసింది.

సిద్దార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ ఇద్దరూ గతంలో పలు పార్టీలలో కనిపించారు. ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన పెళ్లిలో వీరిద్దరూ కలిసి కనిపించారు. దాంతో వారిద్దరి అఫైర్ వ్యవహారానికి మరింత బలం చేకూరింది. దాంతో ఎవరీ నీలమ్ ఉపాధ్యాయ అనే విషయం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆమె గురించి నెటిజన్లు వెతకడం ప్రారంభించారు.

Priyanka Chopra s Brother Siddharth Chopra wedding with Neelam Upadhyaya

సిద్దార్థ్ చోప్రా విషయానికి వస్తే.. గతంలో ఇషితా కుమార్‌తో వివాహం కుదిరింది. అయితే ఆ వివాహం జరగడానికి ముందే క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత కనికా మాథూర్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే పెళ్లికి ముందు ఆ వివాహం కూడా క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నీలమ్ ఉపాధ్యాయతో అఫైర్ కొనసాగించారు.

నీలమ్ ఉపాధ్యాయ్ విషయానికి వస్తే.. ఎంటీవీ స్టైల్ చెక్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మిస్టర్ 7 అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాక్షన్ 3డీ, తమాషా అనే సినిమాలో కూడా నటించింది. అనంతరం హిందీలో ఓం శాంతి ఓం మూవీలను, తమిళంలో ఉన్నోడు ఓరు నాల్ అనే చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X