కరోనా పోరాట యోధులకు 10 వేల పాదరక్షలు.. ప్రియాంక చోప్రా నిర్ణయం
కరోనావైరస్‌ను అరికట్టేందుకు పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి, కార్యకర్తలకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అండగా నిలిచారు. దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు 10 వేల జతల పాదరక్షలు అందించేందుకు చర్యలు తీసుకొన్నారు. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కార్యకర్తలకు పాదరక్షలు అందించే ఏర్పాట్లను చేస్తున్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందే నిజమైన సూపర్ హీరోలు. ప్రాణాంతక వ్యాధిని తరిమి కొట్టేందుకు చేస్తున్న వారి సేవ గొప్పది. రోజు వారీ విధుల్లో వారికి సులభంగా, వారి ఆరోగ్యాన్ని పరీక్షించే విధంగా ఉండే పాదరక్షలను అందించాలని నిర్ణయించుకొన్నాను. అవి శుభ్రం చేసుకోవడానికి తేలిక అని తెలిపారు. ఈ తరుణంలో వైద్య సిబ్బందికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.

ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ప్రధాని నిధికి, మహారాష్ట్ర సీఎం నిధి, పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలకు భారీగా విరాళం అందించారు. తమ విరాళ వివరాలను గోప్యంగా ఉంచారు. పేదలకు, వైద్యులకు, రోజువారీ సినీ కార్మికులకు, వారి పిల్లలకు ఆర్థికంగా సహాయం అందిస్తామని ప్రియాంక చెప్పారు.


Click it and Unblock the Notifications











