ప్రియుడితో ప్రియాంక జైన్ అమెరికాకి జంప్.. ఆ ధైర్యం చేస్తున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ తెలుగు 7 షోలో టావ్ 5 కంటెస్టెంట్ గా నిలిచిన ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మౌనరాగం సీరియల్ తో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. అక్కడ తన తోటి నటుడు అమర్ దీప్ తో కలిసి ఆట ఆడింది. అలాగే మరో సీరియల్ నటి శోభాశెట్టితో కలిసి గ్రూపుగా ఏర్పడి అన్ని గేమ్స్ ఆడుతూ వచ్చారు. చాలా ఫౌల్ గేమ్స్ ఆడుతూ ట్రోలింగ్ కు గురయ్యారు. కానీ హౌస్ లో కొనసాగి చివరకు టాప్ 5లో నిలిచింది. అయితే బిగ్ బాస్ తర్వాత నుంచి ఈమె పూర్తిగా అమెరికాకు షిఫ్టు అవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

సీరియల్ చేస్తున్నప్పుడే మరో సీరియల్ నటుడు శివ్ కుమార్ తో ప్రేమలో పడింది ప్రియాంక జైన్. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండానే.. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. కానీ బిగ్ బాస్ వేధికగా ఈ ముద్దుగుమ్మ తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. అతడితే ప్రేమ, లివింగ్ రిలేషన్ గురించి బయట పెట్టింది. అలాగే ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఆయన హౌస్ లోకి రావడం... ప్రియాంకపై ముద్దుల వర్షం కురిపించడంతో మరోసారి వైరల్ అయ్యారు. రొమాంటిక్ కపుల్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అతడితో కలిసే ఎక్కువగా కనిపిస్తోంది.

Priyanka Jain And Her Boy Friend Shiv Kumar is Going to Shift to America Check Details

ఇటీవలే ఈ ఏడాదిలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని చెప్పిన ప్రియాంక జైన్ మొన్న కంటి ఆపరేషన్ చేసుకుని ఆమె అభిమానులకు గట్టి షాకిచ్చింది. తాజాగా మరో బాంబ్ పేల్చి మరింత టెన్షన్ పడే వార్తను రివీల్ చేసింది. ఆమె తన ప్రియడు శివ్ కుమార్ తో కలిసి హైదరాబాద్ నుంచి పూర్తిగా అమెరికాకు షిఫ్టు అవుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది, ఏం జరగబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రియాంక జైన్ యూట్యూబ్ ఛానెల్ వేధికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఎయిర్ పోర్టులో కనిపించిన వీళ్లు అమెరికాకు షిఫ్టు అయిపోతున్నాం అంటూ ముందుగా చెప్పారు. ఆ తర్వాత అసలు విషయం బయట పెట్టారు. అయితే అమెరికా వెళ్లేది ప్రియాంక కాదని.. తాను మాత్రమేనని శివ్ కుమార్ అన్నాడు. అయితే అమెరికా వెళ్లేందుకు వీసాకు అప్లై చేసుకోగా.. ఇంటర్వ్యూకు రమ్మని కాల్ వచ్చిందట. ఈక్రమంలోనే వీరిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లారు. దాన్ని చూపిస్తూనే అమెరికా వెళ్లిపోతున్నాం అంటూ చెప్పి అందర్నీ షాక్ కు గురి చేశారు.

Priyanka Jain And Her Boy Friend Shiv Kumar is Going to Shift to America Check Details

ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లడం, అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ లో స్టే చేయడం... ఉదయమే శివ్ కుమార్ ఇంటర్య్వూకి వెళ్లి సెలెక్ట్ అవ్వడం..ఆ విషయాన్ని ప్రియాంకకు చెప్పడం కనిపిస్తుంది. అయితే ఈయన వెళ్లేది కేవలం రెండు నెలలు మాత్రమే. అది కూడా ఒంటరిగానే వీడియో మొత్తం చూస్తే తప్ప ఇది అర్థం కాదు. థంబ్ నెయిల్ చూసి, ముందుగా చెప్పిన మాటలు విని ఆపేస్తే మాత్రం వీళ్లేదో పూర్తిగా అక్కడికే వెళ్లిపోయి ఉంటారని అనుకుంటారు. ఇలా ట్విస్ట్ ఇచ్చిన ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X