SSMB28: మహేశ్ మూవీలో క్యూట్ హీరోయిన్ ఫిక్స్.. ఆమెతోనే మొదలెట్టాలని ప్లాన్

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న ఈ స్టార్ హీరో.. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహేశ్ వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుని.. గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ విజయాలు ఇచ్చిన జోష్‌తో ఉన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో అతడి కెరీర్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

కొద్ది రోజుల క్రితమే సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు సూపర్ స్టార్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాయి. కానీ, ఫుల్ రన్‌లో మాత్రం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను అందుకోలేకపోయింది. అయినప్పటికీ 90 శాతం కంటే ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక, ఈ సినిమా తర్వాత తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లిన మహేశ్.. వచ్చిన వెంటనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.

Priyanka Mohan Fix for Mahesh and Trivikram Movie

'సర్కారు వారి పాట' పట్టాలపై ఉన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. ఈ మూవీ పూజా కార్యక్రమాలు మాత్రం కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇక, జూలై నెల నుంచి ఈ సినిమా మొదలు అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

త్రివిక్రమ్ - మహేశ్ బాబు కలయికలో రాబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు మరో బ్యూటీని కూడా ఇందులో నటింపజేస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్‌ కూడా నటిస్తుందట. వాస్తవానికి ఈ పేరు గతంలోనే వినిపించినా.. చిత్ర యూనిట్ మాత్రం ఇటీవలే ఆమెను కన్ఫార్మ్ చేసినట్లు తెలిసింది. ఇక, ఆగస్టు నుంచి మొదలయ్యే షూటింగ్‌లో మహేశ్ - ప్రియాంక మధ్యనే సీన్లను షూట్ చేయబోతున్నారని సమాచారం. ఆ తర్వాతనే పూజా హెగ్డే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించబోతుందని టాక్.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో హీరో రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X