Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Prabhas సుకుమార్ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చిన అగ్ర నిర్మాత.. ఏమన్నారంటే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుతం పూర్తి చేయాల్సిన సినిమాల లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. ఇక ప్రభాస్ మరో రెండు మూడు నెలల్లో కొత్త ప్రాజెక్టులను కూడా ఎనౌన్స్ చేయబోతున్నట్లుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సుకుమార్ తో కూడా ఒక సినిమా ఫిక్స్ కాబోతున్నట్లుగా టాక్ అయితే వినిపించింది. ఆ విషయంలో ఒక ప్రముఖ నిర్మాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

వరుసగా 4 సినిమాలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 4 సినిమాలను లైన్లో పెట్టాడు. ముందుగా ఆదిపురుష్ సినిమా 2023 సమ్మర్ చివరలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పనుల కోసం మళ్లీ ఇంకా సమయం తీసుకున్నారు. అలాగే వచ్చే ఏడాది సలార్ సినిమా కూడా రానుంది. ఇక మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు K కూడా లైన్లోనే ఉంది.

ఏ సినిమా ఎంత వరకు వచ్చింది?
వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్. ఈ సినిమాలను పూర్తి చేయాలి అంటే మరో మూడేళ్ల సమయం అయితే పడుతుంది. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ అయితే సగానికి పైగా పూర్తయింది. ప్రాజెక్టు కె కూడా 40 శాతానికి పైగా పూర్తయింది. ఇక మారుతి సినిమా ప్రభాస్ నెల రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు. ఇక లైన్లో ప్రభాస్ కోసం అర్జున్ రెడ్డి దర్శకుడు కూడా ఒక కథ రెడీ చేసుకున్న విషయం తెలిసిందే.

సుకుమార్ తో సినిమా?
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో కూడా ప్రభాస్ ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఇక దిల్ రాజు ప్రొడక్షన్లో కూడా ఒక సినిమా చేయాలని ప్రభాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇక వాటితోపాటు సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చర్చల దశలో ఉన్నట్లుగా టాక్ అయితే వినిపించింది. గతంలోనే చాలాసార్లు ప్రభాస్ సుకుమార్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక ఇటీవల వీరి మధ్య చర్చలు జరిగినట్లు మరొక న్యూస్ అయితే వైరల్ అయింది.

ఆ ప్రొడక్షన్ లో సినిమా..
సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే సుకుమార్ రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు కూడా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రభాస్ తో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్లో ప్రభాస్ సుకుమార్ సినిమా రాబోతున్నట్లుగా టాక్ వచ్చింది.

అందులో నిజం లేదు
ఇక అధికారికంగా అభిషేక్ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభాస్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా నిర్మించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని అభిషేక్ అగర్వాల్ అధికారికంగా మీడియాకు వివరణ ఇచ్చారు. దీంతో సుకుమార్ ప్రభాస్ కాంబో పై మొత్తానికి ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ వీరి కాంబినేషన్లో తప్పకుండా సినిమా వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.