ఆ డైరెక్టర్లు అలా చీట్ చేశారు.. దర్శకుడు పరుశురాంపై అరవింద్ ఘాటైన వ్యాఖ్యలు
2018 సంవత్సరంలో కేరళను ముంచెత్తిన వరదల ఆధారంగా రూపొందిన చిత్రం 2018. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ...
ఓ ముఖ్యమైన పనిమీద యూఎస్ వెళ్లాను. అయితే బన్నీ వాసు ఒక రోజు ఫోన్ చేసి.. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నానని ఉద్వేగానికి లోనవుతూ చెప్పాడు. ఈ సినిమా తెలుగులో మనమే చేయాలని అన్నాడు. మనమే ఎందుకు చేయాలని నేను అడిగితే.. ఇతర భాషల్లో వచ్చే మంచి సినిమాలను మనమే డబ్బింగ్ చేస్తున్నాం.ఈ సినిమా చూస్తే మూడు నాలుగు సార్లు ఉద్వేగానికి లోనవుతామని చెప్పారు. దీన్ని మనం రిలీజ్ చేద్దామని అన్నాడని అల్లు అరవింద్ చెప్పారు.
2018 మూవీ థ్యాంక్యూ మీట్ రాగానే నేను, బన్నీ వాసు, చందూ మొండేటి కలిసి ముగ్గురం ఫోటో దిగాం. ఆ ఫోటో ఎందుకు దిగామంటే.. మాకు ఆయన సినిమా తీశాడు. ఆయన సినిమా వచ్చి సంవత్సరం అయింది. మాతో సినిమా చేసిన తర్వాత ఆయనకు ఇతర బ్యానర్ల నుంచి టెంప్టింగ్ ఆఫర్లు వచ్చాయి. కానీ ఏదీ ఒప్పుకోలేదు. దానికి ఓ కారణం ఉందని అల్లు అరవింద్ చెప్పారు.

మాతో సినిమా చేయడానికి ముందు చందూ మొండేటితో మొదటి సినిమా చేసిన తర్వాత మూడు సినిమాలు చేయాలనే అగ్రిమెంట్ ఉంది. కాబట్టి ఆ ఒప్పందం ఉల్లంఘించకుండా మాతోనే సినిమాలు చేయడానికి కట్టుబడి ఉన్నారు. కానీ నా ద్వారా పైకి వచ్చిన చాలా మంది ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమాలు చేశారు. ఎందరు ఎన్ని చెప్పినా చందూ మొండెటి మా అగ్రిమెంట్‌కు కట్టుబడి ఉన్నారు. అందుకే ఆయనతో ఫోటో దిగాను అని అల్లు అరవింద్ తెలిపారు.
ఇక 2018 సినిమా విషయానికి వస్తే.. అమెరికా నుంచి వచ్చిన వెంటనే నేను ఈ సినిమాను చూశాను. జెట్ లాగ్‌తో సినిమా చూడగలనా? అనే సందేహంతో సినిమా చూడటం ప్రారంభించాను. కానీ జెట్ లాగ్ లేకుండా సినిమాలో లీనమయ్యాను. సెకండాఫ్‌లో సినిమా చూస్తుంటే.. తుఫానులో మునిగిపోయానా అనే ఫీలింగ్ కలిగించింది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలి అని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

2018 సినిమా ముగిసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏమిటంటే... ఒక మంచి సినిమాకు రొమాన్స్ అవసరం లేదు. పెద్ద పెద్ద హీరోలు అవసరం లేదు. రెగ్యులర్ సినిమాకు కావాల్సిన అంశాలు ఏమీ లేవు. కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉన్నాయి. ప్రతీ వ్యక్తిలో ఓ హీరో ఉంటాడు. పరిస్థితులు వాడిని హీరో చేస్తాయి. వాళ్లు ఎంతటి త్యాగానికి సిద్దపడుతారు అనే ఉద్వేగంతో చెప్పిన కథ ఇది. లెక్కలు వేసుకొని చేసిన చిత్రం కాదు అని అల్లు అరవింద్ అన్నారు.


Click it and Unblock the Notifications











