Telangna Elections Voting బీరు తాగి పడుకొంటారా? వారిపై అల్లు అరవింద్ అసహనం
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులందరూ తమ పరిధిలోని పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గురువారం ఉదయం నుంచే సినీ ప్రముఖులంతా ఓటు హక్కును ఉపయోగించుకొనేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
తెలంగాణ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్‌కు సినీ తారల నుంచి భారీ స్పందన కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ నుంచి చిన్న తారలందరూ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటు వేశారు.

ఓటు హక్కు ఉపయోగించుకొన్న తర్వాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఓటు హక్కు విలువ గురించి అందరికి స్పూర్తిని కలిగించేలా మాట్లాడారు. అంతేకాకుండా ఓటు హక్కు ఉపయోగించుకోకుండా ఇంట్లోనే ఉన్న ఓట్లర్లకు చురకలు అంటించారు.
మీడియాతో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఓటు ఏం వేస్తాములే అంటూ కొందరు ఇంట్లోనే కూర్చుంటారు. వారికి నేను ఒకే మాట చెబుతున్నాను. ప్రభుత్వాలను విమర్శించే హక్కును కోల్పోతారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే కోరిక కూడా మనసులో ఉండకూడదు. ఈ రోజు హాలీడే అని బీరు తాగి ఇంట్లో పడుకొంటే మీకు ప్రశ్నించే అవకాశం కోల్పోతారు అని అరవింద్ ఘాటుగా స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో అతి తక్కువగా ఓటింగ్ నమోదైంది. ఇప్పటి లానే లాంగ్ వీకెండ్ రావడంతో కొందరు తమ సొంత ఊర్లకు, అలాగే వీకెండ్ హాలీడేకు ప్లాన్ చేసుకొన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలోనే అల్లు అరవింద్ అసహనం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, నిర్మాతగా అల్లు అరవింద్ తన సామాజిక బాధ్యతగా ఇటీవల కోట బొమ్మాళి అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఓటు హక్కు, ప్రభుత్వ అధికారులపై రాజకీయ నేతల ఒత్తిడి అంశాలపై సెటైరిక్ అంశంగా ప్రస్తావించారు. ఈ సినిమాకు మంచి స్పందన వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











