‘తండేల్’లో సాయి పల్లవే ఎందుకు?.. తెర వెనుక కథ చెప్పిన మెగా ప్రొడ్యూసర్!

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం హీరోయిన్లలో సాయిపల్లవి అత్యధికులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందింది. బోల్డ్ కంటెంట్ కు దూరంగా ఉంటూనే, తనదైన శైలిలో విభిన్న పాత్రలను పోషిస్తూ వస్తోంది. సినిమాలతో ప్రేక్షకుల మనస్సులను, తన వ్యక్తిత్వంతో తెలుగువారి హృదయాలను గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించి మెప్పిస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్లు సొంతం చేసుకుంటోంది.

సాయి పల్లవి మొదట డ్యానర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నటిగా మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది. తెలుగు ప్రేక్షకులను శేఖర్ కమ్ముల 'ఫిదా'తో పలకరించింది. మొదటి సినిమాతోనే తన పెర్ఫామెన్స్ తో ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన నటన, డైలాగ్ డెలవరీ, సింపుల్ లుక్ తో ఇండస్ట్రీలో అప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

Producer Allu Aravind reveals why Sai Pallavi was cast in Thandel

తద్వారా సినిమా తర్వాత సినిమాలు చేస్తూ వస్తోంది. నెక్ట్స్ 'తండేల్' తో రాబోతోంది. ఈ చిత్రం రేపు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్కినేని నాగచైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. శ్రీకాకుళం ఫిషర్ మెన్ పాత్రలో చైతూ, సత్య పాత్రలో సాయిపల్లవి అలరించబోతున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. నేషనల్ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి చివరిగా 'అమరన్' చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. మేజర్ ముకుంద్ వైఫ్ పాత్రలో తమిళ స్టార్ శివకార్తీకేయ సరసన చక్కటి నటనను ప్రదర్శించింది. ఈ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన సొంతం చేసుకుంది. ఇక ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్' రేపే విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు వార్తలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో సాయి పల్లవినే ఈ మూవీలో ఎందుకు తీసుకున్నారే ప్రశ్నకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పిన తెర వెనక కథ వైరల్ గా మారింది.

Producer Allu Aravind reveals why Sai Pallavi was cast in Thandel

తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి ప్రతిభ గురించి మాట్లాడారు. 'తండేలో సినిమాలో బాలీవుడ్ నుంచి ఎవరినీ హీరోయిన్ గా ఎంచుకోలేకపోయాం. ఆ పాత్రకు సాయిపల్లవి తప్ప ఇంకెవ్వరు సరిపోరు. ఇది కమర్షియల్ సినిమా అయినప్పటికీ బాంబే నుంచి వైట్ స్కిన్ అమ్మాయిని తీసుకోలేం. ఎందుకంటే సాయిపల్లవి పోషించిన పాత్ర ఎంతో నిజాయితీని ప్రదర్శిస్తుంది. అలాంటి పాత్రలను సాయి పల్లవి అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంది. సహజంగానే తను అలాంటి వ్యక్తి. అందుకే ఆమెను ఎంపికచేశాం' అని తెలియజేశారు.

సాయి పల్లవి ముక్కుసూటిగా ఉంటుందని అందరికీ తెలిసిందే. సింపుల్ గా కనిపించే తాను ఎలాంటి వేదికలపైనైనా అంతే నిజాయితీగా మాట్లాడుతుంది. తండేల్ విషయంలో తన వ్యక్తిత్వమే బలమైన పాత్రలో నటించేందుకు కారణమవడంతో తన అభిమానులు సంతోషిస్తున్నారు.

More from Filmibeat

Read more about: sai pallavi allu aravind thandel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X