Viduthalai Part 1 తెలుగులోకి వెట్రిమారన్ మూవీ.. అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్

అసురన్ లాంటి సంచలన చిత్రాలను అందించిన దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విడుదలై పార్ట్ 1 చిత్రం తమిళనాడులో భారీ వసూళ్లను సాధిస్తున్నది. RS ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం సినీ విమర్శకులనే కాకుండా, సగటు ప్రేక్షకుడిని మెప్పించింది. ఈ సినిమా తొలి వారాంతంలో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. కమెడియన్ సూరి విభిన్నమైన పాత్రలో, విజయ్ సేతుపతి విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నది.

గీతా ఆర్ట్ష్ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ.. పిరియాడిక్ పోలీస్ ప్రొసీజర్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన విడుదలై: పార్ట్ 1 మార్చి 31న తమిళనాడులో రిలీజై భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తుండటంతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించాం. త్వరలోనే విడుదలై: పార్ట్ 1 సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తాం అని గీతా ఆర్ట్స్ ప్రతినిధులు తెలిపారు.

 Producer Allu Aravinds Geeta Arts to release Vetrimarans Viduthalai Part 1 Telugu Version

కన్నడ చిత్రంగా రిలీజై సంచలన విజయం సాధించిన కాంతార చిత్రం గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమాకు బ్రహ్మండమైన ఆదరణ లభిచండంతో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. అదే కోవలో ప్రస్తుతం వెట్రిమారన్ రూపొందించిన విడుదలై: పార్ట్ 1 సినిమాను రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకొనేందుకు రెడీ అవుతున్నది.

విడుదలై పార్ట్ 1 సినిమా గత నాలుగు రోజుల ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో సుమారు 15 కోట్ల షేర్ నమోదు చేయగా, 20 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని కొనసాగిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X