ఆ హీరోయిన్‌ని సీక్రెట్‌గా ఫాలో అయ్యా.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్‌ను శాసించే కొందరిలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఒకరు. సినిమాల నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉంటారు అరవింద్. గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా సినిమా హిట్ అనేంతగా తనదైన ముద్ర వేశారు. తన జడ్జిమెంట్, నిర్ణయాలకు తిరుగులేదని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు అల్లు అరవింద్. తాజాగా ఓ హీరోయిన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న అరవింద్
2020లో చివరిసారిగా అల వైకుంఠపురం నిర్మించిన అల్లు అరవింద్ దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. అయితే ఈ ఏడాది అక్కినేని నాగచైతన్యతో తండేల్, శ్రీవిష్ణుతో సింగిల్ సినిమాలు తీసి హిట్స్ కొట్టారు అరవింద్. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా వరకు సినిమాల నిర్మాణాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసుకు అప్పగించేశారు అల్లు అరవింద్. బన్నీ వాసు కూడా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Producer Allu Aravind Said That He Secretly Followed The Heroine

బన్నీ వాసు సమర్పణలో మిత్రమండలి
తాజాగా బన్నీ వాసుకు చెందిన నూతన నిర్మాణ సంస్థ బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మిత్రమండలి. కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా విజయేందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మిత్రమండలి టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

యూత్‌తో ఎక్కువ గడుపుతా
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. నా మిత్రులందరూ కలిసి ఈ సినిమాను తీశారని, తాను యువతతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తానని అల్లు అరవింద్ తెలిపారు. దీని వల్ల స్క్రిప్ట్ ఎంపిక విషయంలో ఎంతో హెల్ప్ అవుతుంది. ఓ రోజున బన్నీవాసు పంపించిన ఓ దర్శకుడు నా ముందు కథ చెప్పలేక ఇబ్బంది పడ్డాడని అల్లు అరవింద్ గుర్తుచేసుకున్నారు. ఇక మిత్రమండలిలో హీరోయిన్‌గా చేసిన నిహారికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందన్నారు.

Take a Poll

ఆ అమ్మాయిని సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా
వాసు కొన్ని అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి హీరోయిన్‌గా ఎవరు బాగుంటారని అడిగాడని.. నేను నిహారిక ఫోటో చూపించి ఆమెను సెలెక్ట్ చేశానని అల్లు అరవింద్ తెలిపారు. మీకెవ్వరికీ తెలియని విషయం ఏంటంటే ఈ అమ్మాయిని నేను ఫేక్ ఐడీతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నానని అల్లు అరవింద్ చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఇన్‌స్టాలో ఆ అమ్మాయి చాలా స్పీడ్‌గా ఉంటోందని, నేను ఒరిజినల్ ఐడీతో ఫాలో అయితే పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తాయని అందుకే ఇలా ఫేక్ ఐడీతో నిహారికను ఫాలో అవుతున్నట్లు అల్లు అరవింద్ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: allu aravind niharika nm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X