Hari Hara Veera Mallu రిలీజ్ పై నిర్మాత క్లారిటీ.. రామ్ చరణ్ సెంటిమెంట్ డేట్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అసలైతే ఈపాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ వివిధ కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ ఇతర సినిమా షూటింగ్స్ చేయాల్సి వచ్చింది. అలాగే రాజకీయ కారణాల వలన కూడా అనుకోకుండా గ్యాప్ ఇచ్చాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల మళ్ళీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

అసలైతే షూటింగ్ సరిగ్గా రావడం లేదు అని క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదు అని నిర్మాత ఏం రత్నం ఒక డేట్ తో అయితే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల తేదీపై కొనసాగుతున్న సస్పెన్స్ కు మొత్తానికి తెరదించారు. రామ్ చరణ్ తన కెరీర్ లో బెస్ట్ సక్సెస్ అందుకున్న రంగస్థలం సినిమా వచ్చిన రోజే ఈ సినిమా కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. 2023 మార్చి 30వ తేదీన హరిహర వీరమల్లు సినిమా అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్నట్లు నిర్మాత వివరణ ఇచ్చారు.

producer AM Ratnam clarification on pawan kalyan hari hara veera mallu release date

దీంతో ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతొంది. తప్పకుండా ఈ సినిమా కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుంది అని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఇదివరకే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది ఇక త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ ను మరింత స్పీడ్ పెంచాలి అని అనుకుంటున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ హరి శంకర్ దర్శకత్వంలో కూడా మరొక సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు ఇక లిస్టులో సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X