ఆ డైరెక్టర్ పరమ నీచుడు.. వాడి వల్లే బాలకృష్ణ మూవీకి కోట్ల నష్టాలు.. నిర్మాత ఆవేదన

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తనదైన శైలిని ప్రదర్శించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలయ్య చెరగని ముద్ర వేసుకున్నారు. ఏపీ మాజీ సీఎం, నట సార్వ భౌమ, దివంగత సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు. అన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు ఇందూపురం ఎమ్మెల్యేగానూ టీడీపీ నుంచి ఎన్నికై ప్రజా సేవ చేస్తున్నారు.

మరోవైపు సినిమాలు, టాక్ షోతోనూ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నారు. ఆరు పదుల వయస్సు దాటినా తన సినిమాలతో దుమ్ములేపుతున్నారు. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే. చివరిగా 'అఖండ', 'వీర సింహారెడ్డి', 'డాకూ మహారాజ్' వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్నారు. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించారు.

Producer Ambika Krishna Shocking Comments about Balakrishna Old Movie

ఇదిలా ఉంటే.. బాలయ్య నటించిన ఓ చిత్రంతో కోట్లు నష్టపోయానని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా వల్ల ఎంతో నష్టం జరిగిందని, దానికి కారణం కూడా చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు... బాలయ్య వీరభద్ర సినిమా పాడై పోవడానికి కారణం ఆ సినిమా దర్శకుడే కారణం. వందశాతం ఆ మూవీని డైరెక్ట్ చేసిన రవి కుమార్ చౌదరే కారణం. పరమనీచుడు, వాడి వల్లనే సినిమా పాడైపోయింది. నాకు మొహమాటం ఏమీ లేదు.

ఇష్టమొచ్చినట్టు సినిమా తీసేసి, బడ్జెట్ అనుకున్నది ఒకటి ఖర్చు పెట్టించింది మరోకటి, స్క్రిప్ట్ ఒకటి తీసింది ఒకటి. ఒళ్లు పొగరుతోటి అహంకారంతోటి సినిమా తీశాడు. బాలయ్య లాంటి గొప్ప నటుడి నుంచి డేట్స్ వచ్చాక కూడా ఈ నీచుడు సరిగా సినిమా చేయలేకపోయాడు. తాగి షూటింగ్ కు వచ్చే వాడు. బాలయ్య కూడా అతన్ని కోప్పడేవాడు. నేను బాలయ్యను నమ్ముకోవడంతో మళ్లీ ఎప్పుడైనా సినిమా చేస్తానని హామీనిచ్చారు. వీరభద్ర సినిమా విషయంలో బాలయ్య గారి తప్పేమీ లేదు. ఆయన డైరెక్టర్ ఏమీ చెబితే అదే చేస్తారు. ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే ఇంకా ఏమీ మాట్లాడకుండా డైరెక్టర్ ను ఫాలో అవుతాడని చెప్పుకొచ్చారు. ఆ దర్శకుడితో ఎన్నో సార్లు గొడవలు కూడా అయ్యాయని చెప్పారు. బాలయ్య కూడా డైరెక్టర్ పై కేకలు వేసిన మారేవాడు కాదు.

వీరభద్ర సినిమాతో నష్టపోవడంతో బాలయ్య మళ్లీ సినిమా చేస్తానని హామీనివ్వడంతో ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నాను.. అని చెప్పుకొచ్చారు. ఇక వీరభద్ర చిత్రం అంబికా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 2005లో రూపుదిద్దుకుంది. తనూ శ్రీ దత్తా, సదా హీరోయిన్లు గా నటించారు. ఇక ఈ బ్యానర్ లో చివరిగా జంప్ జిలానీ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు బాలయ్య నెక్ట్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2'లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: balakrishna tollywood veerabhadra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X