Agent డిజాస్టర్ కావడంపై స్పందించిన చిత్ర నిర్మాత.. అదే మేము చేసిన పొరపాటు అంటూ..

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని విడుదలకు ముందు అక్కినేని అభిమానుల్లో అయితే కొంత నమ్మకం ఏర్పడింది.ఎందుకంటే, అఖిల్ ను సరికొత్త ఫిట్నెస్ తో కనిపించడంతోపాటు టీజర్ ట్రైలర్ కూడా కాస్త బజ్ అయితే పెంచింది.

కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. అయితే ఈ క్రమంలో చిత్ర నిర్మాత సినిమా ఫలితం పై స్పందిస్తూ జరిగిన పొరపాటు గురించి కూడా క్లారిటీగా తెలియజేశారు ఆ వివరాల్లోకి వెళితే..

Producer anil sunkara about agent movie disaster results

బిగ్ కాంబినేషన్ పై నమ్మకం: మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సురేందర్ రెడ్డి మొదటిసారి అక్కినేని అఖిల్ తో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు అనగానే సినిమా ప్రేక్షకులలో ఎంతో అంచనాలు పెరిగిపోయాయి. కిక్ రేసుగుర్రం లాంటి సూపర్ హిట్టు సినిమాలను తీసిన సురేందర్ రెడ్డి మరోసారి తనకు బాగా కలిసి వచ్చిన వక్కంతం వంశీ కథతోనే ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. తప్పకుండా ఈ కాంబినేషన్లో మరో సక్సెస్ పడుతుంది అని కూడా అందరూ ఊహించారు.

Producer anil sunkara about agent movie disaster results

అఖిల్ ఎలా ఇప్పుకున్నాడు?: అయితే సినిమా మాత్రం ఊహించని విధంగా మొదటి రోజు మొదటి ఆటకే డిజాస్టర్ అని తేలిపోయింది. సినిమాలో ఏ విధమైన కంటెంట్ కూడా అంతగా కనెక్ట్ కాలేదు అని ముఖ్యంగా కథ లోపం అలాగే సన్నివేశాలు చిత్రీకరణ ఏమాత్రం కనెక్ట్ కాలేదు అని ఓవర్గం ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు ఈ సినిమా చేయడానికి అఖిల్ ఎలా ఒప్పుకున్నాడో అని కూడా సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.

Producer anil sunkara about agent movie disaster results

ఏజెంట్ పై ముందే ఒక క్లారిటీ: అయితే ఈ సినిమా ఫలితం పై ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. సాధారణంగా పెద్ద సినిమాలకు ఫలితాలతో సంబంధం లేకుండా సక్సెస్ అంటూ పార్టీలు చేస్తూ హడావిడి చేస్తూ ఉంటారు. కానీ ఏజెంట్ సినిమా విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఆ హడావిడైతే కనిపించలేదు. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా ఫలితం పై ముందుగానే ఒక క్లారిటీ కి వచ్చి ఉంటుంది అని ఇప్పుడు అర్థమవుతోంది.

Producer anil sunkara about agent movie disaster results

జరిగిన పొరపాటు ఇదే అంటూ: ఇక ఏజెంట్ ఫలితం పై నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేము ఏజెంట్‌ మూవీ ఫెయిల్యూర్ కావడంతో పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుంటున్నాము. ఇది ఒక భారీ సినిమా అని మాకు తెలిసినప్పటికీ, మేము సక్సెస్ కొట్టాలి అనుకున్నాము. కానీ మేము బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడంలో పొరపాటు జరిగింది అన్నారు.

Producer anil sunkara about agent movie disaster results

మొత్తానికి క్లారిటిగా చేప్పేసిన నిర్మాత: కోవిడ్‌తో సహా అసంఖ్యాక సమస్యలు రావడం వల్ల అనుకున్నట్లు ప్రాజెక్ట్ ను ఫినిష్ చేయడంలో విఫలమయ్యాము. మేము ఈ విషయంలో ఎటువంటి సాకులు చెప్పకూడదనుకుంటున్నాము. అయితే ఈ ఖరీదైన తప్పు నుండి నేర్చుకోవాలి. మేము తప్పులను ఎప్పటికీ పునరావృతం చేయము అని నిర్ధారించుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాము. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు. మేము మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో అంకితమైన ప్రణాళికతో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తాము.. అని అనిల్ సుంకర అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X